twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసు వద్ద ‘నోటా’ పరిస్థితి ఎలా ఉందంటే...?

    |

    విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా మీద ఏ రేంజిలో హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడి గత చిత్రాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించడం, 'నోటా' ట్రైలర్ అందరికీ తెగ నచ్చేయడం,ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ కెరీర్లో మరో భారీ విజయం ఖాయం అని అంతా భావిస్తున్న తరుణంలో శుక్రవారం ఉదయం షోలు పడ్డ తర్వాత ఊహించని షాక్ తగిలింది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీసు పరిస్థితి ఎలా ఉంది, ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయో ఓలుక్కేద్దాం.

    నన్నుతొక్కాలని చూస్తే ఊరుకొను.. కాంగ్రెస్ వాళ్లనే అడగండి.. ఆ భయం ఉంది.. విజయ్ దేవరకొండనన్నుతొక్కాలని చూస్తే ఊరుకొను.. కాంగ్రెస్ వాళ్లనే అడగండి.. ఆ భయం ఉంది.. విజయ్ దేవరకొండ

    యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్

    యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్

    ఇండియా కంటే ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయ్యాయి. ప్రస్తుతానికి యూఎస్ ప్రీమియర్ షో కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 119 లొకేషన్లలో $173,432 వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 148 లొకేషన్లలో ప్రీమియర్స్ ప్రదర్శించారు. మిగతా స్క్రీన్లకు సంబంధించిన కలెక్షన్ వివరాలు బయటకు రావాల్సి ఉంది.

    విజయ్ గత సినిమాలతో పోలిస్తే మూడో స్థానం

    విజయ్ గత సినిమాలతో పోలిస్తే మూడో స్థానం

    విజయ్ దేవరకొండ గత సినిమాల కలెక్షన్లతో పోలిస్తే... ‘నోటా' యూఎస్ ప్రీమియర్ షో కలెక్షన్స్ మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అతడు నటించిన ‘గీత గోవిందం' ప్రీమియర్ షోల ద్వారా $403,442 రాబట్టింది. అర్జున్ రెడ్డి చిత్రం $194k వసూలు చేసింది.

    తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఖాయం, కానీ...

    తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఖాయం, కానీ...

    మరో వైపు ‘నోటా'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఖాయం అని తేలిపోయింది. సినిమాపై ముందు నుండీ భారీ హైప్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ ‘గీత గోవిందం' స్థాయిలో ఉండక పోవచ్చు అంటున్నారు.

    యావరేజ్ టాక్... ఈవీకెండ్‌తో తేలిపోతుంది

    యావరేజ్ టాక్... ఈవీకెండ్‌తో తేలిపోతుంది

    తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ‘నోటా' యావరేజ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా భవితవ్యం ఏమిటి? అనేది ఫస్ట్ వీకెండ్ తర్వాత తేలనుంది. ప్యూర్ పొలిటికల్ డ్రామా కావడం, తమిళ ప్లేవర్ ఎక్కువగా ఉండటం, దేవరకొండ అభిమానులు కోరుకున్న స్టఫ్ లేక పోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    NOTA has started on a good note and made a decent collection at the US box office in the premiere show on Thursday. #NOTA collects $173,432 through premieres in USA from 119 locations with avg of $1,457. More locs expected! Vijay Deverakonda’s earlier film #GeethaGovindam collected $403,442 through premieres. #ArjunReddy premieres - $194k.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X