దీపావళికి కానుకగా నవంబర్ -2010 రిలీజుల లిస్టు..
వచ్చే వారమే దీపావళి తెలుగువారిని పలకరించనున్నది. ఈ నేపధ్యంలో 'నవంబర్ విడుదల"కు సిద్ధమవుతున్న చిత్రాలను పరిశీలిస్తే... నాగార్జున నటించిన 'గగనం", వెంకటేష్ నటిస్తున్న 'నాగవల్లి" నవంబర్‌లో విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అలాగే నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తూ నిర్మిస్తున్న 'కత్తి" నవంబర్ 12న విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంపై పరిశ్రమలో చాలా పాజిటివ్ టాక్ ఉంది. అదేవిధంగా.. రామ్‌చరణ్ మూడో చిత్రం 'ఆరెంజ్" కూడా నవంబర్ రెండోవారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆడియో ఓ రేంజ్‌లో హిట్టవ్వడం ఈ చిత్రం పట్ట అంచనాలను మరింత ఎక్కువ చేస్తున్నది.
ఇక ఈ నాలుగు పెద్ద చిత్రాలతోపాటు శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రముఖ నటుడు జీవీ దర్శకత్వం వహిస్తున్న 'రంగ ది దొంగ", వరుణ్ సందేష్-నిషా అగర్వాల్ జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న 'ఏమైంది ఈవేళ" కూడా దీపావళికి కానుకగా.. కొంచెం ముందు వెనుక విడుదల కానున్నాయి. అదేవిధంగా తమిళ నట దిగ్గజం శివాజీ గణేష్ మనవడు జూనియర్ శివాజీ గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించబడిన ఓ తమిళ చిత్రం తెలుగులో 'చిరుతపులి-ఫ్రమ్ మధురై" పేరుతో విడుదల వుతోంది. ఈ చిత్రంతోపాటు నవంబర్‌లో విడుదల కానున్న మరో అనువాద చిత్రం 'షాపింగ్‌మాల్" కూడా విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











