'లయన్' కు కోత మొదలైంది. ఇంతకీ ఏ సీన్స్ ?
హైదరాబాద్: బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' మొన్న గురువారం విడుదలైంది. అయితే మార్నింగ్ షోకే చాలా చోట్ల నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో వెంటనే యూనిట్ రంగంలోకి దిగి, డ్యామేజ్ కంట్రోలు చర్యలు మొదలెట్టింది. అందులో భాగంగా...14 నిముషాలు ని ఈ రోజు(ఆదివారం) నుంచి కోత పెట్టారని సమాచారం. అయితే ఏమి కట్ చేసారో తెలియరాలేదు. త్రిష,బాలకృష్ణ మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్ చాలా ఇబ్బందిగా ఉండటంతో దాన్ని లేపి ఉంటారని భావిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కథేమిటంటే....
ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు .

ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.
బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు


Click it and Unblock the Notifications











