Don't Miss!
- News YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
NTR30: ఎన్టీఆర్, కొరటాల శివ కెరీర్లోనే హెయ్యెస్ట్ బడ్జెట్.. సినిమాలో అగ్ర నటీనటులు కూడా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ప్రాజెక్తులు ఏడాదికి రెండు మూడు వచ్చేలా ఉన్నాయి. మన అగ్ర హీరోలు ఏ మాత్రం తగ్గకుండా ఒకదాని తరువాత మరొక సినిమాను లైన్ లో పెడుతున్నారు. ఇక బడ్జెట్ విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదు. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం మైండ్ బ్లోయింగ్ అనేలా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నటీనటులు విషయంలో కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే ఆలోచిస్తున్నారు.
రామ్ చరణ్ తో సమానంగా
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమా కోసం 450కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా మరొక హీరోగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు కాబట్టి అన్ని రికార్డులను కూడా సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.
మార్కెట్ ను మిస్ చేసుకోవద్దని..
RRR లాంటి సినిమా తరువాత రాబోయే ప్రాజెక్ట్ అంతకు మించి అనేలా ఉండకపోయినా కూడా పాన్ ఇండియా మార్కెట్ ను మళ్ళీ మిస్ చేసుకోవద్దని తారక్ చేస్తున్న ప్లాన్స్ అన్ని ఇన్ని కావు. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. మొత్తానికి కొరటాల శివ అయితే మరొక మంచి సందేశంతో హై వోల్టేజ్ కథను రాసుకున్నాడు.
బడ్జెట్ మొత్తం ఎంతంటే..
ఎన్టీఆర్ 30వ సినిమాకు మొదట 100కోట్ల వరకు ఖర్చవుతుందని అనుకున్నారట. కానీ ఎప్పుడైతే సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని అనుకున్నారో బడ్జెట్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దాదాపు 200కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దర్శకుడు కొరటాల శివ పర్ఫెక్ట్ ప్లాన్ తో సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అందుకే బడ్జెట్ అలా సెట్టయ్యింది
ఇక సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేనితో పాటు కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కూడా ముందే రెమ్యునరేష్ తీసుకోకుండా బిజినెస్ జరిగిన తరువాత వాటాలు తీసుకునేలా అగ్రిమెంట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. కొరటాల శివ కూడా దాదాపు అదే తరహాలో ఒప్పందం చేసుకోవడంతో సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీపడడం లేదని సమాచారం.
అగ్ర నటీనటులను..
ఇక ఎన్టీఆర్ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ నెవర్ బిఫోర్ అనేలా అగ్ర నటీనటులను దింపనున్నట్లు సమాచారం. ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ వంటి యాక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు అంతకంటే హై రేంజ్ లో ఆలోచించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి కొరటాల అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.