వారంలోనే 20 కోట్లు వసూలు చేసిన 'అదుర్స్'
జూనియర్ ఎన్టీఆర్ 'అదుర్స్' మొదటివారంలోనే 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల కథనం. ఈ సినిమా ఈనెల 13న విడుదలైంది. తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత ఎదురైనా హైకోర్టు జోక్యంతో ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ సినిమా అడ్డంకులు లేకుండా ఆడుతోంది. మొదట్లో సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఎన్టీఆర్ పోషించిన పూజారి పాత్ర, అదరగొట్టే పాటలు ఈ సినిమాను విజయపథంలో నడీపిస్తున్నాయి.
వినాయక దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ పాత చింతకాయపచ్చడిలా ఉందని ఈ సైట్ సమీక్షకులు కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఆ విమర్శలను అధిగమించి సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోవడం విశేషం. బ్రహ్మానందం, ఎన్టీఆరల మధ్య నడిచిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. మాస్ హీరో కామెడీ చేయడం వైవిధ్యంగా ఉండడంతో జనం విరగబడుతున్నారు. సినిమా టైటిల్ ను పవర్ ఫుల్ గా పెట్టి ఉంటే ఇంకా బాగా అదిరేదని విశ్లేషకుల అంచనా.


Click it and Unblock the Notifications











