మహేష్, ప్రభాస్ రికార్డులు బ్రద్దలు కొట్టిన ఎన్టీఆర్(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్ షా'. " 'బాద్ షా' డిసైడ్ అయితే.... వార్ వన్ సైడ్ అవ్వుద్ది" అంటూ వచ్చిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ పెంచింది. దాంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ స్టైలిష్ కామెడీ... ఓవర్ సీస్ ట్రేడ్ లో... కొత్త చరిత్రను సృష్టిస్తోంది.
ఇక చిత్రంలో దూకుడు తరహాలో బ్రహ్మానదం, ఎమ్ ఎస్ నారాయణ పాత్రలు పూర్తి కామెడీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని భావిస్తున్నాయి. ఆడియో కూడా సూపర్ హిట్ అవటం సినిమాకు బాగా కలిసి వచ్చే అంశం. ఇక ఈ చిత్రం యుఎస్ లో 120 స్క్రీన్స్ కు పైగా విడుదల అవుతోంది. 11 స్క్రీన్స్ కెనడాలో.. 12 స్క్రీన్స్ ఆస్ట్రేలియాలో, 40 స్క్రీన్స్ యుకె మరియు యూరప్ లలో విడుదల అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో 25 చోట్ల, టోక్యో, కెన్యా, టాంజీనియా, సౌత్ ఆఫ్రియా, సింగపూర్ లలో 5 థియోటర్స్ వరకూ విడుదల అవుతున్నాయి.
మిర్చి, నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రికార్డుని ఈ చిత్రం బ్రేక్ చేస్తోందని ట్రేడ్ లో చెప్తున్నారు. హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' లో ఈ మ్యాజిక్ జరుగుతుందంటున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్. బండ్ల గణేష్ నిర్మాత.
మిగతా వివరాలు స్లైడ్ షో లో చూసి ఆనందించండి...

తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

హీరోయిన్ తోపాటు ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్ తదితరులపై తీసిన వినోద ప్రధానమైన కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు.

ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి.

‘బాద్ షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారని నిర్మాతలు అంటున్నారు.

నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది అని నిర్మాత గణేష్ చెప్పారు.

ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది అని దర్శకుడు శ్రీను వైట్ల చెప్తున్నారు.

వచ్చే నెల 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ చిత్రం మార్చి 29న సెన్సార్ జరగనుంది.

ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ద్వారా విడుదలైన డైలాగులు ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి.

'బాద్ షా' చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయటానికి నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించారు.

ఎన్టీఆర్‌లోని నటుణ్ని కొత్త తరహాలో చూడొచ్చు. ఆయన గెటప్, పలికే సంభాషణలు అందర్నీ అలరిస్తాయి.

ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్ ఓవర్ చెప్పడంతో ఓ రేంజి క్రేజ్ క్రియేట్ అవుతోంది.

ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన వస్తోంది.

తమన్ స్వరాలు ఎన్టీఆర్ అభిమానులకు బాగా నచ్చాయి. ఈ నెలాఖరున ప్లాటినం డిస్క్ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











