2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ పరిస్థితి ఏమిటి?
Recommended Video

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
ఫస్ట్ డే భారీ సంఖ్యలో అభిమానులు పోటెత్తడంతో వసూళ్లు అదిరిపోయాయి. అయితే రెండో రోజు గురువారం కావడంతో వసూళ్లు చాలా తగ్గాయి. అయితే వీకెండ్ మళ్లీ కలెక్షన్స్ పుంజుకునే అవకావం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తొలి రోజు ఎంత వసూలు చేసింది?
తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్-కథానాయకుడు' తొలి రోజు రూ. 7.63Cr కోట్ల షేర్ రాబట్టింది. అత్యధికంగా గుంటూరులో రూ. 2.04 కోట్ల షేర్ వసూలవ్వగా, నైజాంలో రూ. 1.72 కోట్లు రాబట్టింది. ఈస్ట్,వెస్ట్‌లో అత్యల్పంగా షేర్ వసూలైంది. ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు మాత్రమే రాబట్టింది.

రెండో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు
అయితే రెండో రోజు ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌లో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఓవరాల్‌గా రూ. 1.14 కోట్లు మాత్రమే షేర్ వసూలైంది. వీక్ డే కావడం వల్లనే రెండో రోజు వసూళ్లు ఇలా ఉన్నాయనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

2 డేస్ టోటల్ ఎంత?
రెండు రోజుల వసూళ్లు కలిపితే టోటల్ షేర్ రూ. 8.77 కోట్లకు చేరుకుంది. అయితే సంక్రాంతి హాలిడేస్ మొదలవ్వడం, వీకెండ్ కలిసి వస్తుంది కాబట్టి తొలి వారాంతం వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.

రైట్స్ ఎంతకు అమ్మారు?
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి రూ. 55 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. పండగ సీజన్ కాబట్టి సినిమా ఈజీగా ఎలాంటి నష్టాలు లేకుండా బయట పడుతుందని, మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











