ఎన్టీఆర్ కథానాయకుడు లేటెస్ట్ కలెక్షన్స్.. ఇంకా 50 కోట్లు తేడా.. 2వ వారంలో పరిస్థితి ఏంటి!
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటనతో అదరగొట్టాడు. దర్శకుడిగా క్రిష్ మరో మారు సత్తా చాటాడు. కానీ సినిమా విజయానికి, మంచి వసూళ్లకు ఇది సరిపోలేదు. చిత్రంలో ఉన్న భారీ తారాగణం కూడా సినిమాకు వసూళ్లు తెచ్చిపెట్టలేకపోయింది. దీనితో రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఎలాంటి విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు తాజా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మంచి టాక్.. కానీ
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. కానీ క్రమంగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ రావడంతో సంక్రాంతి సీజన్ లో కూడా ఆశించిన వసూళ్లు నమోదు కాలేదు. ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. చిత్రంలో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సన్నివేశాలు తక్కువగా ఉన్నాయనే విమర్శ ఎదురవుతోంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయి నటించినా ఫలితం లేకపోయింది.

ఇంకా 50 కోట్ల తేడా
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి దాదాపు 70 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా వసూళ్లు ఆ స్థాయిలో లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు అసాధ్యమే. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. 9 రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 19. 26 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే ప్రీరిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే ఇంకా 50 కోట్ల ఈ చిత్రం వెనుకబడే ఉంది.

ఆ ఏరియాలో
రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు గాను ఈ చిత్రం 14 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. కేవలం గుంటూరులో మాత్రమే కాస్తో కూస్తో మంచి వసూళ్లు వస్తున్నాయి. గుంటూరులో ఈ చిత్రం 3 కోట్ల షేర్ కు చేరువగా ఉంది. కానీ గుంటురులో ఈ చిత్ర హక్కులు 6 కోట్లకు అమ్ముడు కావడంతో అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్ కు నష్టాలే మిగలనున్నాయి. నైజాం, సీడెడ్ ఏరియాలలో బయ్యర్లకు 10 కోట్ల వరకు నష్టాలు వాటిల్లనునట్లు తెలుస్తోంది.

రెండవ వారం
పండుగ సెలవుల్లోనే కథానాయకుడు చిత్రం మంచి వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక సెకండ్ వీకెండ్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఓవర్సీస్ లో ఈ చిత్రం 3.5 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్ లో ఈ చిత్ర థియేట్రికల్ బిజినెస్ 10 కోట్లు. ఇక ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో 1.45 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











