‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ఫస్ట్ డే రికార్డు... బాలయ్య కెరీర్లో టాప్ ఓపెనింగ్స్!
బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' తొలిరోజు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. గౌతమీపుత్ర శాతకర్ణి ఓపెనింగ్స్ రికార్డులను బద్దలు కొట్టి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రంపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో థియేట్రికల్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికిపైగా స్క్రీన్లలో విడుదల చేశారు. పండగ సీజన్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది.

తొలిరోజు ఎంత వసూలైంది?
సినిమాకు సంబంధించిన అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు రూ. 13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు టాక్.

తెలుగు రాష్ట్రాల్లో షేర్ ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 9 కోట్ల మేర డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే కలెక్షన్లకు సంబంధించి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది. సినిమాకు అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యీపీగా ఉన్నారు.

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద..
యూఎస్ఏలో ‘ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రాన్ని 200లకు పైగా లొకేషన్లలో ప్రదర్శించారు. వీకెండ్ కాకుండా బుధవారం సినిమా రిలీజైనప్పటికీ మంచి రెస్పాన్స్ బావుంది. ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు హాఫ్ మిలియన్ వసూలు చేయడం విశేషం.

గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డ్ బద్దలు
గతంలో బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘గౌతమీ పుత్రశాతకర్ణి' సంక్రాంతికి విడుదలై.... తొలి రోజు రూ. 18.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘ఎన్టీఆర్-కథానాయకుడు' రూ. 21 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ వసూలు చేయడం ద్వారా ఆ రికార్డును బద్దలు కొట్టినట్లయింది.


Click it and Unblock the Notifications











