twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్.... లాభాలు వస్తాయా?

    |

    Recommended Video

    NTR Kathanayakudu First Week Box Office Collections | Filmibeat Telugu

    బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఆయన తండ్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేక పోవడం డిస్ట్రిబ్యూటర్లను కలవరపెడుతోంది.

    తాజాగా బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకున్న ఈ మూవీ బిజినెస్ పరంగా చాలా వెనకపడింది. పండగ సీజన్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ఫ్లో ఈ బయోపిక్ ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వైపు లేక పోవడం గమనార్హం. తొలి వారం ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో చూద్దాం.

    తొలి వారం ఎంత వసూలు చేసింది?

    తొలి వారం ఎంత వసూలు చేసింది?

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలివారం ఈ చిత్రం రూ. 33.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 18.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    తొలి వారం ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్‌కు అందిన మొత్తం(షేర్) పరిశీలిస్తే... నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్ నుంచి రూ. 1.60 కోట్లు, ఆంధ్రా టెర్రిటరీస్ నుంచి రూ. 8.20 కోట్లు, యూఎస్ఏ రూ. 2.85 కోట్లు, కర్నాటక రూ. 1.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియా నుంచి రూ. 90 లక్షలు వసూలైనట్లు తెలుస్తోంది.

    లాభాలు వస్తాయా?

    లాభాలు వస్తాయా?

    ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రకల్ రైట్స్ రూ. 70 కోట్లు అమ్మినట్లు సమాచారం. ఇప్పటి వరకు షేర్ రూ. 20 కోట్లకు కూడా మించక పోవడంతో లాభాలు వస్తాయా? లేదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొని ఉంది. సినిమా ఫుల్‌రన్ పూర్తయితే తప్ప ఈ విషయంలో ఓ అంచనాకు రావడం కష్టం.

    ‘ఎఫ్ 2’ ఎఫెక్ట్

    ‘ఎఫ్ 2’ ఎఫెక్ట్


    ఈ సంక్రాంతి సీజన్లో విడుదలైన మూడు చిత్రాల్లో ‘ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ఆధిపథ్యం కనిపిస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులంతా ఈ సినిమా వైపు మొగ్గు చూపడంతో ఈ ప్రభావం ‘ఎన్టీఆర్-కథానాయకుడు', ‘వినయ విధేయ రామ' చిత్రాలపై పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    English summary
    Nandamuri Balakrishna's NTR Kathanayakudu, directed by Krish, which was released on 9th January 2019, has earned Rs 18.5 Cr shares at Worldwide box office after 1st Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X