షాకింగ్‌గా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు.. మూడు రోజుల్లో ఎంతంటే..

తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చెందడానికి ఎనలేని కృషిని చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవత కథా నేపథ్యంగా తెరకెక్కిన ఎన్టీఆర్: కథానాయకుడు మంచి వసూళ్లను సాధిస్తున్నది. జనవరి 9న రిలీజైన ఈ చిత్రంపై సినీ విమర్శకుల మిశ్రమ స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే గత మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు సాధించడం సినిమాపై ప్రేక్షకాదరణ స్పష్టమైంది. గత మూడు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

తొలిరోజున భారీ ఓపెనింగ్స్

తొలిరోజున భారీ ఓపెనింగ్స్

ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రానికి రిలీజ్ రోజున భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దాంతో సినిమా భారీ లాభాలు సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు.

రెండోరోజున క్షీణత

రెండోరోజున క్షీణత

అయితే రెండో రోజున ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అందుకు కారణం రజనీకాంత్ నటించిన పేట, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ రిలీజ్ కావడమే. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం రూ.7 కోట్లు మాత్రమే సాధించింది.

మూడో రోజున వసూళ్లు

మూడో రోజున వసూళ్లు

ఇక మూడో రోజున ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం తొలి రోజున సీడెడ్‌లో రూ.20 లక్షల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా తెలంగాణ, ఆంధ్రల్లో రూ.9 కోట్ల షేర్ సాధించింది.

 యూఎస్‌లో కలెక్షన్లు

యూఎస్‌లో కలెక్షన్లు

అమెరికాలో ఎన్టీఆర్ బయోపిక్ నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. గత నాలుగు రోజుల్లో యూఎస్ బాక్సాఫీస్ వద్ద రూ.4 కోట్లవ వసూళ్లు సాధించింది. వారాంతంలో ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొనే అవకాశం ఉంది.

క్రిష్ దర్వకత్వంలో

క్రిష్ దర్వకత్వంలో

గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె ఫేం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎన్టీఆర్: కథానాయకుడు రూపొందిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించారు. రానా దగ్గుబాటి, రకుల్, హన్సిక తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X