బాలయ్య కెరీర్లోనే రికార్డ్... యూఎస్ఏలో ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ కలెక్షన్స్ ఎక్సలెంట్!

Recommended Video

NTR Kathanayakudu First Day Collections | Filmibeat Telugu

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్టీఆర్-కథానాయకుడు' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఇక్కడ 200కులపైగా లొకేషన్లలో 600కుపైగా ప్రీమియర్ షోలతో రిలీజ్ చేశారు. ఈ బయోపిక్ మీద ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చింది.

అమెరికా కాలమానం ప్రకారం... జులై 8వ తేదీ రాత్రి 11.45 గంటల వరకు 171 లొకేషన్ల నుంచి కలెక్షన్ల వివరాలు అందాయి. ఈ సమయం వరకు $442,998 గ్రాస్ వసూలైంది. పూర్తి కలెక్షన్ వివరాలు అందాల్సి ఉంది.

ఎక్సలెంట్ ఓపెనింగ్స్ అంటున్న ట్రేడ్ విశ్లేషకులు

ఎక్సలెంట్ ఓపెనింగ్స్ అంటున్న ట్రేడ్ విశ్లేషకులు

అమెరికాలో ప్రీమియర్ షోలకు ఒక్కో లొకేషన్‌ నుంచి యావరేజ్‌గా $2,590.63 వసూలైంది. ఇంకా 29 లొకేషన్లకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.

ఫస్ట్ వీకెండ్ పైనే అందరి చూపు...

ఫస్ట్ వీకెండ్ పైనే అందరి చూపు...

సినిమా బుధవారం విడులవుతుండటంతో ఫస్ట్ వీకెండ్‌కు 5 రోజులు కలిసొచ్చింది. దీంతో తొలివారాంతం వరకు 1 మిలియన్ నుంచి 1.5 మిలియన్ డాలర్ వసూళ్ల మార్కును అందుకోవడం ఖాయం అంటున్నారు.

బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

యూఎస్ఏ మార్కెట్లో ఇప్పటి వరకు వచ్చిన బాలయ్య సినిమాల రికార్డులన్నింటినీ ఈ చిత్రం తుడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయని, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ రన్‌లో 2 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తోంది

తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తోంది

మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్-కథానాయకుడు' బాక్సాఫీసును కుమ్మేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులో ఈ చిత్రాన్ని దాదాపు 1000 స్క్రీన్లలో విడుదల చేశారు. తొలి రోజు గ్రాస్ రూ. 30 కోట్లు మార్కును అందుకుంటుందని అంచనా.

గీత గోవిందం రికార్డ్ బద్దలు

గీత గోవిందం రికార్డ్ బద్దలు

ఎన్టీఆర్-కథానాయకుడు ప్రీమియర్ షోల ద్వారా$442,998 వసూలు చేయడంతో... గీతగోవిందం $404,000 ప్రీమియర్ షో రికార్డ్ బద్దలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X