యూఎస్ఏ బాక్సాఫీస్ రిపోర్ట్: ఎన్టీఆర్ ఓకే, వినయ విధేయ రామ ఢమాల్, ఎఫ్ 2 కేక...

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నడూ లేనంత సందడి కనిపిస్తుంది. కనీసం మూడు పెద్ద సినిమాలు పోటాపోటీగా విడుదలైన బాక్సాఫీసు బరిలో నువ్వా.. నేనా.. అనే విధంగా తలపడతాయి. ఎప్పటిలాగే ఈ పండక్కి కూడా మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద తమ లక్ పరీక్షించుకుంటున్నాయి.

బాలయ్య నటించిన 'ఎన్టీఆర్-కథానాయకుడు', రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', వెంకీ-వరుణ్ తేజ్ మల్టీస్టారర్ 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' భారీ అంచానలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యూఎస్ఏలో ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ఎన్టీఆర్ కథానాయుడు

ఎన్టీఆర్ కథానాయుడు

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తీసిన చిత్రం కావడంతో ‘ఎన్టీఆర్-కథానాయకుడు'పై ముందు నుంచీ భారీ హైప్ ఉంది. అందుకు తగిన విధంగానే మంగళవారం 200 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోలతో విడుదల చేశారు. ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ బుధవారం, గురువారాల్లో వసూళ్లు డ్రాప్ అయ్యాయి. రజనీకాంత్ ‘పేట', రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ' రిలీజ్ కావడమే ఇందుకు కారణం. అయితే శనివారం ‘ఎఫ్ 2' విడుదలైనప్పటికీ వసూళ్లలో గ్రోత్ కనిపించడం గమనార్హం.

1 మిలియన్ రీచ్ అవుతుందా?

1 మిలియన్ రీచ్ అవుతుందా?

ఎన్టీఆర్ కథానాయకుడు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద శనివారం వరకు $794,117 వసూలు చేసింది. ప్రీమియర్ షోల ద్వారా మంగళవారం $476,384, బుధవారం $99,537, గురువారం $42,641, శుక్రవారం $81,412 , శనివారం $87,693 రాబట్టింది. ఆదివారంతో ఈ వసూళ్లు 1 మిలియన్ రీచ్ అవుతుందని అంచనా.

వినయ విధేయ రామ ఢమాల్

వినయ విధేయ రామ ఢమాల్

రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం ప్రీమియర్ షోలతో కలిపి తొలి 2 రోజుల్లో $227,830 రాబట్టింది. ప్రీమియర్ షోల ద్వారా $181,118, రిలీజ్ రోజైన శుక్రవారం $30,445, శనివారం $16,267 రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ కనీసం హాఫ్ మిలియన్ రీచ్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

ఎఫ్ 2 వసూళ్లు కేక..

ఎఫ్ 2 వసూళ్లు కేక..

ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్.... బాలయ్య, రామ్ చరణ్ చిత్రాల కంటే బడ్జెట్ పరంగా, హైప్, ప్రమోషన్స్, రిలీజైన స్క్రీన్స్ పరంగా తక్కువగానే ఉన్నప్పటికీ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. ప్రీమియర్ షోల ద్వారా అద్భుతమైన టాక్ స్ప్రెడ్ అవ్వడంతో వసూళ్లు అదిరిపోయాయి. శుక్రవారం $251,263(ప్రీమియర్ షోలు), శనివారం $271,369 రాబట్టింది. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సంక్రాంతి విన్నర్ ఇదే అని తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X