twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహా డిజాస్టర్: ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ (3 డేస్ కలెక్షన్ రిపోర్ట్)

    |

    బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎన్టీఆర్-మహానాయకుడు' బాక్సాఫీసు వద్ద అత్యంత నిరాశ పరిచే ఫలితాలు రాబడుతోంది. ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా ప్రేక్షకులు లేక వెలవెలపోతోంది.

    కొన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి కనీసం థియేటర్ల అద్దె కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం డిజాస్టర్ కేటగిరీలో పడిపోయిందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' వసూలు చేసిన దాంట్లో సగం కూడా వసూలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

    ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్, అయినా పరిస్థితి దారుణం

    ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్, అయినా పరిస్థితి దారుణం

    జనవరి 9న విడుదలైన ‘ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ. 50 కోట్ల నష్టపోయారు. దీంతో ‘ఎన్టీఆర్-మహానాయకుడు' కొనడానికి ఎవరూ ముందుకు రాక పోవడంతో వారికి ఈ చిత్రాన్ని ఫ్రీగా ఇచ్చేశారు. అయితే వచ్చే రాబడిలో నిర్మాతలకు 60శాతం, డిస్ట్రిబ్యూటర్లకు 40 శాతం దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినప్పటికీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.

    3 డేస్ కలెక్షన్ ఎంత?

    3 డేస్ కలెక్షన్ ఎంత?

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొలి 3 రోజుల్లో రూ. 3.40 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉండటం, కొన్ని చోట్ల థియేటర్ల రెంటు కూడా వెళ్లని పరిస్థితి ఉండటంతో వారం రోజులు కూడా బరిలో నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు.

    3 డేస్ ఏరియా రిపోర్ట్

    3 డేస్ ఏరియా రిపోర్ట్

    నైజా: రూ. 64 లక్షలు, సీడెడ్ రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 28 లక్షలు, గుంటూరు రూ. 62 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 17 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 18 లక్షలు, కృష్ణ రూ. 29 లక్షలు, నెల్లూరు రూ. 10 లక్షలు, రెస్టాఫ్ ఇండియా: రూ. 25 లక్షలు, ఓవర్సీస్ రూ. 60 లక్షలు.

    40 శాతం అంటే... డిస్ట్రిబ్యూటర్లకు దక్కేదెంత?

    40 శాతం అంటే... డిస్ట్రిబ్యూటర్లకు దక్కేదెంత?

    ఒప్పందం ప్రకారం వసూళ్లలో డిస్ట్రబ్యూటర్లకు 40 శాతం దక్కుతుంది. అంటే వసూలైన రూ. 3.40 కోట్లలో.... డిస్ట్రిబ్యూటర్లకు దక్కే షేర్ రూ. 1.36 కోట్లు మాత్రమే. మొదటి భాగం వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన మొత్తం రూ. 50 కోట్లు. అంటే డిస్ట్రిబ్యూటర్ల నష్టాల్లో ఫస్ట్ వీకెండ్ కనీసం 3% కూడా రికవరీ కాలేదు. ఫుల్ రన్‌లో కనీసం 10 శాతం అయినా రికవరీ అవుతుందో.. లేదో?

    English summary
    NTR Mahanayakudu has collected Rs. 3.40 Cr share in first weekend. The film turns as huge disaster like the first part NTR-Kathanayakudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X