‘ఎన్టీఆర్-మహానాయకుడు’ ఏపీ-నైజాం ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్ రిపోర్ట్

Recommended Video

'NTR Mahanayakudu' AP-Telangana First Day Collections | Filmibeat Telugu

ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 22న విడుదలై బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరో వైపు క్రిటిక్ రివ్యూలు సైతం అనుకూలంగా లేకపోవడంతో సినిమా ఓపెనింగ్స్ పరంగా నిరాశ పరిచింది. దీంతో పాటు మౌత్ టాక్ నెగిటివ్‌గా స్ప్రెడ్ అవ్వడంతో ఈ చిత్రానికి రానున్న రోజుల్లో బాక్సాఫీసు వద్ద గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. బరిలో ఇతర పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడం లాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ... థియేటర్ల వైపు ప్రేక్షకులను ఆకర్షించడంలో దర్శక నిర్మాతలు విఫలం అయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్-మహానాయకుడు' తొలి రోజు రూ. 1.59 కోట్ల షేర్ రాబట్టింది. సినిమా స్థాయి, బాలయ్య స్టార్ ఇమేజ్‌తో పోల్చితే ఈ మొత్తం అత్యంత నిరాశ పరిచే వసూళ్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఏరియా వైజ్ కలెక్షన్స్

ఏరియా వైజ్ కలెక్షన్స్

తొలి రోజు ఈ చిత్రం నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్ రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, కృష్ణ జిల్లాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలు మాత్రమే రాబట్టింది.

బాలయ్య ప్లాపు మూవీ కంటే తక్కువగా..

బాలయ్య ప్లాపు మూవీ కంటే తక్కువగా..

ఈ మధ్య కాలంలో బాలయ్య నటించిన ఏ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంత తక్కువ షేర్ వసూలు కాలేదు. తొలిరోజు కలెక్షన్స్ పరంగా చూస్తే గతంలో వచ్చిన కొన్ని బాలయ్య ప్లాపు సినిమాలను కూడా ‘ఎన్టీఆర్-మహానాయకుడు' అందుకోలేక పోయింది.

యూఎస్ఏలోనూ దారుణంగా

యూఎస్ఏలోనూ దారుణంగా

‘ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాన్ని యూఎస్ఏ వ్యాప్తంగా 111 లొకేషన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. వీటి ద్వారా $101,460 వసూలైంది. ఒక్కో లొకేషన్ యావరేజ్ $914 వసూలైంది. మొదటి భాగం కథానాయకుడు($4.82 లక్షలు, లొకేషన్ యావరేజ్ $2,512)తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

డిస్ట్రిబ్యూటర్ల పరిహారం రికవరీ అవుతుందా?

డిస్ట్రిబ్యూటర్ల పరిహారం రికవరీ అవుతుందా?

మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయుడు' వల్ల తీవ్ర నష్టం ఏర్పడటంతో ‘మహానాయకుడు' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్రీగానే ఇచ్చేశారు. సినిమా ద్వారా వచ్చే వసూళ్లలో 40 శాతం డిస్ట్రిబ్యూటర్ల, 60 శాతం నిర్మాతలకు దక్కేలా ఒప్పందం కుదిరింది. కనీసం డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు రికవరీ అయ్యేంత షేర్ వస్తుందో? లేదో? చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X