ఆర్జీవీ ‘ఆఫీసర్’ కన్నా దారుణంగా ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ కలెక్షన్స్!
అక్కినేని నాగార్జున కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాల్లో 'ఆఫీసర్' మూవీ ఒకటి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం పాలైంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం తాజాగా విడుదలైన 'ఎన్టీఆర్-మహానాయకుడు'.
నైజాం ఏరియాలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో సినిమా థియేటర్ల జంక్షన్‍గా పేరుగాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 'ఎన్టీఆర్-మహానాయకుడు' పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో వరస్ట్ సినిమాల్లో ఒకటిగా పేరుగాంచిన 'ఆఫీసర్' కంటే కూడా 'మహానాయకుడు' ఫస్ట్ డే వసూళ్లు తక్కువగా నమోదయ్యాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో వసూళ్లు ఇవే..
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్లో తొలి రోజు రూ. 1,60,641 మాత్రమే వసూలైంది. బాలయ్య సినిమా, అందులోనూ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాకు ఫస్ట్ డే ఇంత తక్కువ వసూలు కావడం ట్రేడ్ వర్గాలను విస్మయ పరుస్తోంది.

‘ఆఫీసర్' వసూళ్లు...
గతేడాది జూన్ 1న విడుదలైన రామ్ గోపాల్ వర్మ ‘ఆఫీసర్' చిత్రం తొలి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్‌లో రూ. 3,44,718 రాబట్టింది. ‘ఎన్టీఆర్- మహానాయుకుడు' చిత్రం అందులో సగం కూడా వసూలు చేయక పోవడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్-మహానాయకుడు' తొలి రోజు రూ. 1.5 కోట్లకు మించి వసూలు చేయలేదు. ఇంత భారీ చిత్రం, బాలయ్య లాంటి స్టార్ నటించిన సినిమాకు ఇంత తక్కువ వసూలు కావడం ట్రేడ్ వర్గాలను విస్మయ పరుస్తోంది.

డిజాస్టర్ టాక్
యూఎస్ఏలో కూడా ఈ చిత్రానికి వసూళ్లు దారుణంగా ఉన్నాయి. సినిమాకు వచ్చిన బిలో యావరేజ్ క్రిటిక్ రేటింగ్స్, ఆడియన్స్ టాక్, తొలి రోజు రాబట్టిన వసూళ్లను బట్టి మొదటి భాగం ‘కథానాయకుడు' మాదిరిగానే ‘మహానాయకుడు' డిజాస్టర్ అనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











