‘ఎన్టీఆర్-మహానాయకుడు’: రెండో రోజు కలెక్షన్స్ షాక్!
ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండో భాగం 'ఎన్టీఆర్-మహానాయకుడు' బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని ఫలితాలు నమోదు చేస్తోంది. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ తీవ్ర నిరాశ పరిచే విధంగా ఉండగా.. రెండో రోజు ట్రేడ్ వర్గాలకు షాకిచ్చే నెంబర్స్ నమోదయ్యాయి.
బయోపిక్ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' పరాజయం పాలైన ప్రభావం 'మహానాయకుడు'పై బాగా పడింది. దీనికి తోడు రివ్యూలు నెగెటివ్‌గా రావడం, పబ్లిక్ టాక్ అంతకంటే నెగెటివ్‌గా ఉండటంతో సినిమా పరిస్థితి రోజు రోజుకు దిగజారి పోతోంది.
Recommended Video


సెకండ్ డే కలెక్షన్స్ షాక్
‘ఎన్టీఆర్- మహానాయకుడు' తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.5 కోట్ల షేర్ కంటే మించి వసూలు కాలేదు. రెండో రోజు అందరికీ షాకిస్తూ.. ఏపీ-నైజాంలో కలిపి రూ. 45 లక్షల మాత్రమే వసూలైనట్లు సమాచారం. బాలయ్య లాంటి స్టార్ నటించిన మూవీ, రామారావు బయోపిక్‌కు ఇంత తక్కువ వసూళ్లు కావడం అందరినీ విస్మయ పరుస్తోంది.

ఏరియా వైజ్
ఏరియా వైజ్ కలెక్షన్లు పరిశీలిస్తే... నైజాం ఏరియాలో 2వ రోజు రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షల షేర్ మాత్రమే వసూలైందట. వసూళ్లు ఇంత దారుణంగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

3వ రోజ, మహా ప్లాపు దిశగా...
పరిస్థితి చూస్తంటే ‘ఎన్టీఆర్-మహానాయకుడు' మహా ప్లాపు దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నైజాం ఏరియాకు కేంద్రబిందువైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ చిత్రానికి సెలవురోజైన ఆదివారం(3వ రోజు) గత నెలలో విడుదలైన ‘ఎఫ్ 2'(44వ రోజు) కంటే తక్కవగా ఉండటమే ఇందుకు నిదర్శనం. మూడవ రోజు అన్ని ఏరియాల వసూళ్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కలెక్షన్స్
మహానాయకుడు (3వ రోజు)
రూ. 8,785 (మార్నింగ్ షో)
రూ. 18,810(మాట్నీ షో)
రూ. 23,874 (ఫస్ట్ షో)
రూ. 10,183(సెకండ్ షో)
ఎఫ్2 (44వ రోజు)
రూ. 9,531 (మార్నింగ్ షో)
రూ. 25,054(మాట్నీ షో)
రూ. 43,236(ఫస్ట్ షో)
రూ. 15,440(సెకండ్ షో)


Click it and Unblock the Notifications











