‘ఎన్టీఆర్-మహానాయకుడు’ బాక్సాఫీస్ రిపోర్ట్: దారుణంగా పడిపోయిన ఓపెనింగ్స్

Recommended Video

NTR Mahanayakudu 1st Day Box Office Report | Filmibeat Telugu

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం సంక్రాంతికి విడుదలైనపుడు హైప్ ఏ స్థాయిలో ఉందో.. ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే ఆ చిత్రానికి విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. ఆ ప్రభావం తాజాగా విడుదలైన 'ఎన్టీఆర్-మహానాయకుడు'పై పడింది. యూఎస్ఏలో ప్రీమియర్ షోకు ఆదరణ తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం.

మొదటి భాగం స్థాయిలో సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ లేక పోవడం, ప్రమోషన్స్ కూడా సరిగా నిర్వహించక పోవడం కూడా ఓపెనింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పరిస్థితిని ముందే అంచనా వేసిన యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ 'ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని తక్కువ స్క్రీన్లలో విడుదల చేశారు.

మహానాయకుడు యూఎస్ఏ ప్రీమియర్ షో వసూళ్లు

మహానాయకుడు యూఎస్ఏ ప్రీమియర్ షో వసూళ్లు

‘ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాన్ని యూఎస్ఏ వ్యాప్తంగా 111 లొకేషన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. వీటి ద్వారా $101,460 వసైలైంది. ఒక్కో లొకేషన్ యావరేజ్ $914 వసూలైంది.

కథానాయకుడుతో పోల్చితే దారుణంగా పడిపోయిన ఓపెనింగ్స్

కథానాయకుడుతో పోల్చితే దారుణంగా పడిపోయిన ఓపెనింగ్స్

మొదటి భాగం కథానాయకుడుతో పోల్చితే ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి. కథానాయకుడు గత నెలలో 192 లొకేషన్లలో విడుదలై $4.82 లక్షల వసూలు చేసింది. లొకేషన్ యావరేజ్ $2,512 రాబట్టింది. మహానాయకుడు లొకేషన్ యావరేజ్ $914 మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ఎన్టీఆర్-మహానాయుడు' ఓపెనింగ్ డే వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొదటి భాగం ప్లాప్ అవ్వడంతో సినిమాపై తీవ్ర ప్రభావం పడింది. సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సినిమాపై నెగెటివ్ ప్రచారం

సినిమాపై నెగెటివ్ ప్రచారం

ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన ‘ఎన్టీఆర్-మహానాయకుడు'పై మొదటి నుంచి నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఎన్టీ రామారావు గురించి కాకుండా చంద్రబాబు నాయుడుని పాజిటివ్‌గా చూపించే ఉద్దేశ్యంతోనే తీశారనే విమర్శలు రావడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X