ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' ఫైనల్ గా (ట్రేడ్‌టాక్)
ఎన్టీఆర్ తాజా చిత్రం 'ఊసరవెల్లి" ఫైనల్ గా ఫ్లాప్ అని ట్రేడ్ లో ఫిక్స్ చేసారు. సినిమాకి వస్తున్న కలెక్షన్స్ లెక్కలు ప్రకారం ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రాబట్టుకోలేకపోయిందని తేల్చారు.అలాగే 'ఊసరవెల్లి" ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయాయి.అయితే మహేష్‌బాబు 'దూకుడు"మాత్రం తన స్టామినాను నిలబెట్టుకుంటూ కలెక్షన్లు సాధిస్తోంది.ఇక క్రిందటి శుక్రవారం విడుదలైన నాలుగు సినిమాల విషయానికి వస్తే.. అవి గద్దె సింధూర 'కిల్లర్"తో పాటు 'గందరగోళం", ఉపేంద్ర 'పాపి", 'ఆయనకి ఐదుగురు". ముఖ్యంగా ఈ నాలుగు చిత్రాల్లో 'గందరగోళం", 'పాపి", 'ఆయనకి ఐదుగురు" చిత్రాలు మొదటి రోజే ఒక్కడు కూడా ధియోటర్ లో జనం లేక ఎత్తేయ్యాల్సిన పొజీషన్ వచ్చింది.
గద్దె సింధూర 'కిల్లర్" కూడా ఏ మాత్రం సస్పెన్స్‌లేక పూర్తిగా చతికిలపడిపోయింది. ఇక దీపావళికి చూస్తే మన తెలుగు చిత్రాలే లేవు 'రా.వన్" అంటూ షారుఖ్‌ఖాన్, 'సెవెన్త్ సెన్స్" అంటూ సూర్య తెలుగు ధియోటర్స్ కి వచ్చి దీపావళి పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఓపినింగ్స్ తెచ్చుకోగలిగాయి కానీ వర్కవుట్ కాలేదు. రావన్ చిత్రం కేవలం పిల్లలకే పరిమితమైన చిత్రంగా రాప్రేక్షకులు తేల్చారు.


Click it and Unblock the Notifications











