‘రభస’ భారీ ఓపెనింగ్స్...నైజాంలో కేక

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం 'రభస'. ఈ చిత్రం ఆగస్టు 29న వినాయక చవితి కానుకగా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజే నైజాం ఏరియాలో రూ. 2.43 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'రభస' నిలిచిందని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ వారు తెలిపారు.

ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'హెవీ రెయిన్స్‌లో సైతం భారీ ఓపెనింగ్స్‌తో మా 'రభస' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నైజాంలో ఒక్క రోజులోనే 2 కోట్ల 43 లక్షల షేర్ సాధించి ఎన్టీఆర్ చిత్రాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'రభస' నిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా సినిమా చాలా ఎక్స్ ట్రార్డినరీగా ఉందని, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గానీ, సంతోష్ శ్రీనివాస్ టేకింగ్ గానీ, మేకింగ్ గానీ చాలా ఎక్సలెంటుగా ఉందని రిపోర్ట్స్ అందుతున్నాయి. ఈ చిత్రాన్ని అంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్' అన్నారు.

NTR Rabhasa 1st Day Collections

సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ...'యూత్ ఫుల్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా 'రభస' అందర్నీ ఆకట్టుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్టీఆర్ తో చేసిన ఈ ఫస్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ కావడం, భారీ కలెక్షన్స్ సాధించడం ఆనందంగా ఉంది' అన్నారు. ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవి ప్రకాష్, ప్రభాకర్, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్న.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X