Adavi Ramudu4K advance booking.. అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. జోష్‌లో అడవిరాముడు అడ్వాన్స్ బుకింగ్

తెలుగు సినిమా చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన అడవి రాముడు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇండస్ట్రీలో తొలి బాక్సాఫీస్ హిస్టరీని క్రియేట్ చేసిన చిత్రమే కాకుండా స్టార్ స్టామినాను రుజువు చేసిన సినిమాగా అడవి రాముడు సినిమాను పేర్కొంటారు. అలాంటి ఎన్నో ఘనతలు ఉన్న అడవి రాముడు సినిమాను ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నేటి సాంకేతిక అంశాలను జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రికార్డులు, అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

అడవి రాముడు సినిమా ఏపీ, నైజాంలో రికార్డులు తిరగరాసింది. ప్రధాన ప్రాంతాల్లో ఈ చిత్రం 365 రోజులపాటు ఏకధాటిగా ఆడి రికార్డును సృష్టించింది. అప్పట్లో నాలుగు సెంటర్లలో 365 రోజులపాటు ఆడిన షోలే సినిమా రికార్డును కూడా తిరగరాసింది. పలు ప్రాంతాల్లో అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది.

adaviramudu

అడవి రాముడు సినిమా నెల్లూరులో ఓ చరిత్రను నెలకొల్పింది. అప్పట్లో నాలుగు ఆటలు ఆడటమే కష్టంగా మారిన సమయంలో నెల్లూరు కనకమహల్ థియేటర్‌లో ప్రతీ రోజు నాలుగు ఆటలు వేశారు. అలా ఐదు ఆటలతో ఏకంగా 102 రోజులు ప్రదర్శించబడి రికార్డు క్రియేట్ చేసింది. కేవలం అడవి రాముడు సినిమా రికార్డులు తెలుగు రాష్ట్రానికే పరిమితం కాలేదు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా 100 రోజులు ఆడటం విశేషంగా చెప్పుకోవాలి.

స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా అడవి రాముడు సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు. 4K టెక్నాలజీతో ఈ సినిమాను అమెరికాలో 75 లోకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఓవర్సీస్‌లో అడవి రాముడు సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది.

అమెరికాలో అడవిరాముడు (Adaviramudu4K) భారీ ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను సరికొత్త హంగులతో చూసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్సాన్స్ లభించింది. తాజా సమాచారం ప్రకారం.. 69 లోకేషన్లలో 128 షోల కోసం మొత్తం 500 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో మొత్తం 6000 డాలర్ల కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా అడివి రాముడు సినిమాకు మంచి స్పందన కనిపిస్తున్నది. ఎన్టీఆర్ అభిమానులు మరోసారి వెండితెరపై ఈ సినిమాను చూసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాకపోవడంతో కరెంట్ బుకింగ్ ఏ రేంజ్‌లో జరుగుతుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X