ఎన్టీఆర్ ‘బాక్సాఫీస్’ దూకుడు.. చరిత్ర సృష్టించిన అరవింద.. ఖైదీ నం 150 రికార్డు బ్రేక్!
అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం మూడో వారాంతంలోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం ఎన్టీఆర్‌కు సరికొత్త రికార్డును అందించింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఐదో చిత్రంగా ఈ సినిమా నిలిచింది. మూడో వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.165 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజైన సంగతి తెలిసిందే.

18 రోజుల కలెక్షన్లు ఇవే
మూడో వారాంతం ముగిసే సమయానికి అరవింద సమేత చిత్రం రూ.7 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో 18 రోజులు కలెక్షన్లు రూ.165 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కూడగట్టింది. అంతేకాకుండా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

ఖైదీ నంబర్ 150 రికార్డు బ్రేక్
అరవింద సమేత చిత్ర కలెక్షన్ల దాటికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా సాధించిన రూ.164 కోట్ల లైఫ్ టైమ్ రికార్డు బ్రేక్ అయింది. ఇక అరవింద కన్ను రూ.216 కోట్లు సాధించిన రూ.216 కోట్లపై పడింది.
Recommended Video


మరో రూ.15 కోట్లు అంచనా
అరవింద సమేత చిత్రానికి ప్రేక్షకాదరణ పెరగడంతో ఏడు చిన్న సినిమాల స్థానంలో మళ్లీ ఎన్టీఆర్ సినిమాను రిప్లేస్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరో 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

టాప్ లిస్టులో నాలుగు సినిమాలు
టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 15 చిత్రాల జాబితాలో అరవింద సమేత 5వ స్థానంలో నిలిచింది. రూ.1800 కోట్లతో బాహుబలి2 మొదటి స్థానంలో, రూ.600 కోట్లతో బాహుబలి రెండో స్థానంలో, రూ.225 కోట్లతో భరత్ అనే నేను మూడో స్థానంలో, రూ.216 కోట్లతో రంగస్థలం నాలుగో స్థానంలో నిలిచాయి.

5వ స్థానంలో అరవింద సమేత మూవీ
తాజాగా రూ.165 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన అరవింద సమేత ఐదో స్థానంలో నిలిచింది. ఖైదీ నంబర్ 150 చిత్రం రూ.164 కోట్లతో ఆరోస్థానానికి పరిమితమైంది. ఆతర్వాత స్థానాల్లో శ్రీమంతుడు, మగధీర, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది చిత్రాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











