‘రభస’ 20 రోజుల కలెక్షన్స్ (ఏరియా వైజ్)
హైదరాబాద్ : బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం ‘రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కు లోటు ఉండదని భావించారు.
అయితే ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం... ఇరవై రోజులకు Rs 25.32 కోట్లు కలెక్టు చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇదే అత్యంత పూర్ కలెక్షన్ అని చెప్తున్నారు.
Area Collections (Shares)

నైజాం Rs 7.26 కోట్లు
సీడెడ్ Rs 4.75 కోట్లు
వైజాగ్ Rs 2.44 కోట్లు
గుంటూరు Rs 2.84 కోట్లు
కృష్ణా Rs 2.03 కోట్లు
తూర్పు గోదావరి Rs 2.50 కోట్లు
పశ్చిమ గోదావరి Rs 1.98 కోట్లు
నెల్లూరు Rs 1.52 కోట్లు
మొత్తం Rs 25.32 కోట్లు ( ఆంధ్రా మరియు తెలంగాణ కలిపి )
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మనందం,ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్‌రెడ్డి, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











