»   »  'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు సంపాదన అంతా?

'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు సంపాదన అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం తొలిరోజే రాష్ట్రంలో రూ. 8.7 కోట్లు సంపాదించినట్లు సినీ వ్యాపార వర్గాల అంచనా. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా...మంచి వసూళ్లనే రాబట్టింది. తొలిరోజే భారీ మొత్తం వచ్చింది. అయితే మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయితే వారం మొత్తం కలెక్షన్స్ మొత్తం బట్టి సినిమా రేంజిని డిసైడ్ చేస్తారు.


ఈ చిత్రంలో ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత,శృతి హాసన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.

ఇక ఈ చిత్రం కథ చూస్తే .... మినిస్టర్ ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న నందు(ఎన్టీఆర్) మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి అక్షర (సమంత)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం...శృతి హాసన్ పాత్ర ఏమిటి... అనేది మిగతా కథ.


కేవలం ఇంటర్వెల్ ట్విస్ట్ ని నమ్ముకుని చేసిన ఈ చిత్రం కథ కి సెకండాఫ్ ప్లాష్ బ్యాక్ దెబ్బ కొట్టింది. ముఖ్యంగా దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా ప్లాష్ బ్యాక్ ఉండటంతో అది సాగిన ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు తర్వాత ఏం జరుగుతుందనే ప్రెడిక్టుబులిటీ సెకండాఫ్ లో బాగా ఎక్కువైంది. తర్వాత ఏం జరిగిందేనేది చాలా ఈజీగా ఊహించేలా తయారుచేసారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేకుండా పోయింది. ఉన్న కొద్ది జోకులూ పేలలేదు. ఆ మాత్రమైనా చూడగలిగామంటే అది ఎన్టీఆర్ నటనా గొప్పతనమని నిశ్శందేహంగా చెప్పవచ్చు. ఇక హరీష్ శంకర్ నుంచి ఆశించే పంచ్ లు సైతం ఫస్టాఫ్ లో బాగా పేలాయి కానీ...సెకండాఫ్ లో అవీ లేవు. అంతేకాక ఈ రోజుల్లో ఇంకా జమీలు లేని ఈ రోజుల్లో జమీందారు వారసుడు అని ఎన్టీఆర్ ని చెప్పడం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే సినిమాకు హైలెట్ అవుతుందనుకున్న శృతి హాసన్ పాత్ర కూడా తేలిపోయింది.

English summary
Released in around 1,500 screens across the globe, Ramayya Vasthavayya has collected approximately Rs 13.07 crores at the worldwide Box Office on the first day. Its opening day shares are Rs 2.37 cr in Nizam, Rs 1.88 cr in Ceeded, Rs 46 lakhs in Nellore, Rs 1.28 cr in Guntur, Rs 56 lakhs in Krishna, Rs 73 lakhs in West, Rs 75 lakhs in East, Rs 64 lakhs in UA, Rs 1.35 cr in Karnataka, Rs 55 lakhs from rest of India and Rs 2.5 cr overseas. While film critics gave Ramayya Vasthavayya mixed reviews, viewers have given it thumbs up. A good word of mouth is expected to take its business upwards over the weekend. Trade experts feel that the movie will do fantastic collection at the Box Office in the first weekend and beat the record of Junior NTR's previous release Baadshah.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu