‘రామయ్యా వస్తావయ్యా’ 31 డేస్ కలెక్షన్ రిపోర్ట్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం థియేటర్లలో 31 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కాస్త ఆశాజనకమైన వసూళ్లు సాధించడం గమనార్హం. సినిమా బిజినెస్ పూర్తయ్యే వరకు రూ. 35 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. నిర్మాతకు లాభాలు రాక పోయినా....పెట్టబడి దాదాపుగా రికవరీ అయినట్లు భావిస్తున్నారు.
ట్రేడ్ వర్గా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఏపీ బాక్సాఫీసు వద్ద 31 రోజుల్లో రూ. 24.23 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. నైజాం ఏరియాలో రూ. 8.90 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 5 కోట్లు, వైజాగ్ ఏరియాలో 2.46 కోట్లు, నెల్లూరులో రూ. 1.47 కోట్లు, కృష్ణాలో రూ. 1.13 కోట్లు, గుంటూరులో రూ. 2.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.37 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.40 కోట్లు వసూలు చేసింది.
అమెరికాలో ఈ చిత్రం 90 స్క్రీన్లలో ప్రదర్శితం అయి 2.11 కోట్లు($3,42,448) వసూలు చేసింది. కర్ణాటక ఏరియాలో మొత్తం రూ. 3.82 కోట్లు రాబట్టింది. ఇండియాలోని ఇతర ఏరియాలన్నీ కలిపి రూ. 1.5 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. జూ ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈచిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. 31.66 కోట్లు వసూలు సాధించింది.
జూ ఎన్టీఆర్ నటించిన గత సినిమా 'బాద్ షా' చిత్రం రికార్డును 'రామయ్యా వస్తావయ్యా' అధిగమిస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం పూర్తిగా విఫలమైంది.


Click it and Unblock the Notifications












