భారీగా కర్ణాటకను టార్గెట్ చేసిన జూ.ఎన్టీఆర్

By Srikanya

ఈ సారి జూ.ఎన్టీఆర్ తన స్ట్రాటజీ మార్చుకుని ముందుకెళ్తున్నాడు. తన తాజా చిత్రం దమ్ము కి గానూ కర్ణాటకను భారీ స్ధాయిలో టార్గెట్ చేసారు. కర్ణాటకలో 150 స్క్రీన్ కి పైగా దమ్ము చిత్రాన్ని రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేసారు. ఇంత భారీ స్ధాయిలో కర్ణాటకలో విడుదల అవుతున్న తెలుగు చిత్రం ఇదే అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. అలా దమ్ము ఈ విషయంలో కొత్త రికార్డుని నెలకొల్పింది. అలాగే ఈ దమ్ముకి మరో ప్లస్ పాయింట్ ఏమింటంటే దమ్ము రిలిజవుతున్న ఈ శుక్రవారం అక్కడ పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కావటం లేదు. గతంలో ఎన్టీఆర్ చిత్రాలు కర్ణాటకలో బాగా పే చెయ్యటంతో ఇలా ఇంత భారీగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ నెల27న విడుదల అవుతోంది.

'దమ్ము' ఆడియో సూపర్ హిట్ కావడం, ట్రైలర్లో జూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, యాక్షన్ పవర్ ఫుల్‌గా కేక పుట్టించే విధంగా ఉండటంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. జూనియర్ కెరీర్లోనే ఈ సినిమా మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా నిలుస్తుందని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఇక ఈ చిత్రంలో కార్తీక, త్రిష హీరోయిన్స్ గా చేస్తున్నారు. కార్తీక తన జోష్ తర్వాత తెలుగులో చేస్తున్న ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.

కార్తీక దమ్ములో తన పాత్ర గురించి మాట్లాడుతూ...'జోష్‌', 'రంగం' చిత్రాల్లోని పాత్రలకు భిన్నంగా కనిపిస్తాను. దీంట్లో నా పాత్ర పేరు నీలవేణి. ఘనమైన వంశ చరిత్ర కలిగిన ఓ పెద్ద కుటుంబానికి చెందిన యువతిని. ఇక అలాంటి కుటుంబంలో ఉన్న యువతి పాత్ర ఎంత హుందాగా, హంగామాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన విషయానికొస్తే... నవరసాలూ పలికించే అవకాశం దక్కింది. హీరోయిన్ గా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే ఇలాంటి పాత్ర దక్కడం సంతోషంగా అనిపించింది అంది.


అలాగే ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బోయపాటి శ్రీను.త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్‌ వల్లభ నిర్మాత. ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్‌ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్‌ యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ అభిమానుల అంచనాలను మించిపోయేలా ఈ చిత్రం ఉంటుంది. కథపై పట్టున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన విధానం చాలా బాగుంది. ఒక గొప్ప చిత్రాన్ని తీశామన్న ఆనందం కలిగింది'' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X