Nuvve Nuvve Collections త్రివిక్రమ్ మూవీకి సూపర్ కలెక్షన్లు.. నువ్వే నువ్వేకు రీరిలీజ్ భారీ రెస్పాన్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. ఇందులో తరుణ్, శ్రియ జంటగా నటించారు. ఈ నెల 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్ల దగ్గర గురూజీ అభిమానుల సందడి కనిపించింది. తొలి రోజు సినిమాకు సూపర్ కలెక్షన్స్ వచ్చాయి.
తెలంగాణ, ఏపీలో శుక్రవారం ఎనిమిది షోలు మాత్రమే వేశారు. ఎనిమిది షోలకు 90 వేల గ్రాస్ లభించింది. కూకట్‌పల్లి విశ్వనాథ్ థియేటర్లో 23,225 రూపాయల గ్రాస్ వచ్చింది. పంజాగుట్టలోని పీవీఆర్ నెక్స్ట్ గాలేరియా మాల్‌లో రాత్రి 10.55 గంటలకు షో వేయగా... హౌస్ ఫుల్ అయ్యింది. ఈ శుక్రవారం ఏడెనిమిది కొత్త సినిమాలు విడుదల అయ్యాయి. అయినప్పటికీ 'నువ్వే నువ్వే' చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీని బట్టి సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

శుక్రవారం థియేటర్స్ దగ్గర స్పందన బావుండటంతో ఈ రోజు మరిన్ని థియేటర్లలో షోలు వేస్తున్నారు. ఈ రోజు (నవంబర్ 5న) ఏపీ, తెలంగాణలో 35 కంటే ఎక్కువ షోస్ ప్లాన్ చేశారు.
అక్టోబర్ 10కి 'నువ్వే నువ్వే' సినిమా విడుదలై 20 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. అప్పుడు కూడా ఎక్స్‌ట్రాడినరీ రెస్పాన్స్ లభించింది. 'నువ్వే నువ్వే' రీ రిలీజ్ కలెక్షన్స్ పట్ల నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించిన 'నువ్వే నువ్వే' చిత్రానికి కోటి సంగీతం అందించారు. హరి అనుమోలు ఛాయాగ్రాహకుడు.


Click it and Unblock the Notifications











