O Romeo Box Office Collections: డీసెంట్‌గా ఓ రోమియో కలెక్షన్లు.. త్రిప్తి డిమ్రీ మూవీకి ఎన్ని కోట్లంటే?
హిందీలో స్టార్ హీరో, హీరోయిన్లు షాహిద్ కపూర్, నానా పాటేకర్, త్రిప్తి డిమ్రీ నటించిన తాజా చిత్రం ఓ రోమియో. ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు రోహన్ నరులా స్క్రీన్ ప్లే అందించారు. హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సాజిద్ నాడియాడ్ వాలా, విపిన్ అగ్నిహోత్రి నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రంలో తమన్నా భాటియా, దిశా పటానీ, విక్రాంత్ మెస్సీ, ఫరీదా జలాల్, అవినాష్ తివారీ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సినిమాటోగ్రఫి: బెన్ బెర్నార్డ్, ఎడిటింగ్: ఆసీఫ్ షేక్, మ్యూజిక్: విశాల్ భరద్వాజ్ తమ బాధ్యతలు వహించారు. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలైన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను టాప్ హీరోలు, సాంకేతిక నిపుణులతోపాటు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను తెరకెక్కించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమా నిర్మాణం కోసం 85 కోట్ల రూపాయలు, 15 కోట్లు ప్రమోషనల్ ఖర్చులు అయ్యాయి. అయితే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. ఇక థియేట్రికల్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది.
త్రిప్తి డిమ్రీ, షాహిద్ కపూర్ తొలిసారి కలిసి నటించడంతోమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్ కావడంతో ప్రాజెక్ట్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై సానుకూలమైన ప్రభావం చూపించాయి. దాంతో ఈ మూవీని సుమారుగా ఇండియాలో 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 1000 స్క్రీన్లలో విడుదల చేశారు అని డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు
ఇక ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద షాహిద్ కపూర్‌కు మంచి ఊపునిచ్చేలా కలెక్షన్లు నమోదు చేస్తున్నది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో షాహిద్ నటించిన దేవా 5.5 కోట్లు, జెర్సీ 3.75 కోట్లు, తెరీ బాతోం మే ఐసా ఉల్జా జియా 7 కోట్లు వసూలు చేసిందది. ఈ సినిమాలకు మించి ఓ రోమియో వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











