Obsession Box Office: 3000 కోట్లకు చేరువగా అబ్సెషన్ వసూళ్లు... భారత్‌లో ఎన్ని కోట్లంటే?

కథ, కథనం బాగుంటే నటీనటులు, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సినిమాలు నిరూపించాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్య పరిచిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోకే వస్తుంది హాలీవుడు మూవీ అబ్సెషన్. హార్రర్, థ్రిల్లర్, సస్పెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన అబ్సెషన్ వరల్డ్ వైడ్‌గా 2500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించడంతో పాటు నిర్మాతలకు వేలాది రెట్ల లాభాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిన్న సినిమా మే 29న భారత్‌లోనూ విడుదలైంది. ఈ నేపథ్యంలో మనదేశంలో అబ్సెషన్ ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది? అనేది పరిశీలిస్తే..

అబ్సెషన్ తారాగణం
క్యాప్‌స్టోన్ పిక్చర్స్, టీ షాప్ ప్రొడక్షన్స్, బ్లూమ్‌హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జేమ్స్ హారీస్, హేలీ నికోల్ జాన్సన్, క్రిస్టియన్ మెర్‌క్యూరి, రోమన్ వియారిస్‌లు ఈ సినిమాను నిర్మించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు. సైకో హార్రర్, సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్‌డ్రాప్‌తో అబ్సెషన్‌ను తెరకెక్కించారు. మైఖేల్ జాన్స్‌టన్, ఇండే నవరాట్టె, కూపర్ టామిల్సన్, మెగన్ లాలెస్, అండీ రిచ్టెర్, డారిన్ టూండర్ తదితరులు అబ్సెషన్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. టేలర్ సెలమన్స్ సినిమాటోగ్రాఫీ అందించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాక్ బార్వెల్ సంగీత దర్శకత్వం వహించారు.

Obsession Box Office Curry Barker s Hollywood Thriller Nears 3000 Crore Worldwide Strong Run Continues in India

అబ్సెషన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమాను 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఫోకస్ ఫీచర్స్ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ... యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ విదేశాల్లోనూ రిలీజ్ చేసింది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 5న అబ్సెషన్ మూవీని తొలిసారిగా స్కీనింగ్‌ చేశారు. ఈ ఏడాది మే 15న అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

అబ్సెషన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
విడుదలై నెల రోజులు కావొస్తున్నా అబ్సెషన్‌కు నార్త్ అమెరికాలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. విడుదలైన 5వ వారాంతంలో అమెరికా, కెనడాలలో కలిపి 19 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 179 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డిస్‌క్లోజర్ డే సినిమా ప్రభావం కొంత చూపిస్తున్నప్పటికీ అబ్సెషన్ తట్టుకుని నిలబడింది. ఇప్పటి వరకు ఈ సినిమా నార్త్ అమెరికాలో 188.4 మిలియన్ డాలర్లు (1780 కోట్ల రూపాయలు) వసూలు చేసింది.

ఇక విదేశాల్లో అబ్సెషన్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. మెక్సికోలో 6.84 మిలియన్ డాలర్లు (64 కోట్ల రూపాయలు), ఇటలీలో 4.67 మిలియన్ డాలర్లు (44 కోట్ల రూపాయలు), మిడిల్ ఈస్ట్‌లో 12.4 మిలియన్ డాలర్లు (117 కోట్ల రూపాయలు) చొప్పున ఇప్పటి వరకు విదేశాల్లో ఈ సినిమాకు 98.1 మిలియన్ డాలర్లు (926 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. నార్త్ అమెరికా కలెక్షన్స్ + విదేశాల్లో వచ్చిన వసూళ్లు కలిపి అబ్సెషన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 286.5 మిలియన్ డాలర్లు (2706 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఈ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే అబ్సెషన్ త్వరలోనే వరల్డ్ వైడ్‌గా 300 మిలియన్ డాలర్ల మార్క్ (2833 కోట్ల రూపాయలు) దాటుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ హాలీవుడ్ మూవీ 375 నుంచి 400 మిలియన్ డాలర్లు (3800 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో అబ్సెషన్ కలెక్షన్స్
తొలిరోజున అబ్సెషన్ మూవీకి భారత్‌లో 1.75 కోట్ల రూపాయల నెట్ వసూలవ్వగా.. తర్వాతి రోజు నుంచి కలెక్షన్స్ పెరిగాయి. తొలి వారం ఈ సినిమాకు 18.55 కోట్ల రూపాయలు, రెండో వారం 31.25 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 3.30 కోట్ల రూపాయలు, పదహారో రోజున 5.85 కోట్ల రూపాయలు, పదిహేడో రోజున 5.60 కోట్ల రూపాయలు చొప్పున 64 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది.

18వ రోజు సోమవారం కూడా అబ్సెషన్ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ అవ్వడం, వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సోమవారం అబ్సెషన్ మూవీకి ఇండియాలో 2414 షోలు ప్రదర్శితమై 16 శాతం ఆక్యూపెన్సీతో ఇప్పటి వరకు 1.17 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. 18వ రోజు ఇండియాలో అబ్సెషన్ మూవీకి 2.50 కోట్ల రూపాయల గ్రాస్ రావొచ్చని భావిస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ హాలీవుడ్ థ్రిల్లర్‌ ఇండియాలో 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Read more about: Obsession hollywood movies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X