Obsession Box Office: 2150 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ విధ్వంసం... ఇండియాలో అబ్సెషన్‌‌కి ఎన్ని కోట్లంటే?

హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ చిన్న థ్రిల్లర్ మూవీ ఇప్పుడు వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తూ.. నిర్మాతలు కలలో కూడా ఊహించని లాభాలతో దూసుకెళ్తోంది. ప్రపంచ సినీ చరిత్రలోనే సంచలనం సృష్టించిన ఈ చిన్న సినిమా మే 29న భారత్‌లోనూ విడుదలైంది. ఈ నేపథ్యంలో మనదేశంలో అబ్సెషన్ ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది? భారతీయుల నుంచి ఈ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది? అనేది పరిశీలిస్తే..

అబ్సెషన్ తారాగణం
క్యాప్‌స్టోన్ పిక్చర్స్, టీ షాప్ ప్రొడక్షన్స్, బ్లూమ్‌హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జేమ్స్ హారీస్, హేలీ నికోల్ జాన్సన్, క్రిస్టియన్ మెర్‌క్యూరి, రోమన్ వియారిస్‌లు ఈ సినిమాను నిర్మించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు. సైకో హార్రర్, సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్‌డ్రాప్‌తో అబ్సెషన్‌ను తెరకెక్కించారు. మైఖేల్ జాన్స్‌టన్, ఇండే నవరాట్టె, కూపర్ టామిల్సన్, మెగన్ లాలెస్, అండీ రిచ్టెర్, డారిన్ టూండర్ తదితరులు అబ్సెషన్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. టేలర్ సెలమన్స్ సినిమాటోగ్రాఫీ అందించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాక్ బార్వెల్ సంగీత దర్శకత్వం వహించారు.

Obsession Box Office Curry Barker s Hollywood Thriller Nears 50 Crore Mark in India

అబ్సెషన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమాను 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఫోకస్ ఫీచర్స్ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ... యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ విదేశాల్లోనూ రిలీజ్ చేసింది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 5న అబ్సెషన్ మూవీని తొలిసారిగా స్కీనింగ్‌ చేశారు. ఈ ఏడాది మే 15న అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

అబ్సెషన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడాతో కలిపి ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 152 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 1453 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక విదేశాల్లో అబ్సెషన్ మూవీకి ఇప్పటి వరకు 57 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 544 కోట్ల రూపాయలు) చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 225.2 మిలియన్ డాలర్లు (2152 కోట్ల రూపాయలు) రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆస్ట్రేలియాలో 5.86 మిలియన్ డాలర్లు (56 కోట్ల రూపాయలు), ఫ్రాన్స్‌లో 4.22 మిలియన్ డాలర్లు (40.33 కోట్ల రూపాయలు), మెక్సికోలో 3.26 మిలియన్ డాలర్లు (31 కోట్ల రూపాయలు), ఇటలీలో 2.88 మిలియన్ డాలర్లు (27.53 కోట్ల రూపాయలు) రాబట్టింది అబ్సెషన్.

భారత్‌లో అబ్సెషన్ కలెక్షన్స్
అబ్సెషన్ మూవీకి తొలిరోజున 1.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.75 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.90 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.90 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 3.30 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 6.75 కోట్ల రూపాయలు, పదో రోజున 7.50 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 3.50 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 39.60 కోట్ల రూపాయల నెట్.. 47.42 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇప్పటి వరకు ఢిల్లీలో 7 కోట్ల రూపాయలు, గుజరాత్‌లో 1.50 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 10 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, తెలంగాణలో 5.25 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో కోటి రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

తొలివారంలో సుమారు 22.10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో వారాంతంలో 21 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. అంటే ఇది దాదాపు ఫస్ట్ వీక్ మొత్తం వసూళ్లతో సమానం. ఫస్ట్ వీకెండ్‌లో కేవలం 9.30 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టిన అబ్సెషన్.. సెకండ్ వీకెండ్‌కు ఏకంగా 125 శాతం అదనపు కలెక్షన్స్‌ని వసూలు చేయడం విశేషం. ఒక హాలీవుడ్ మూవీ విడుదలైన 10 రోజుల్లోనే భారతదేశంలో దాదాపు 47 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం అరుదైన విషయం అంటున్నారు విశ్లేషకులు. అబ్బెషన్ జోరు చూస్తుంటే ఈ వారంలోనే 50 కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

Read more about: Obsession box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X