1000 కోట్లతో చిన్న సినిమా ఆల్‌టైం రికార్డ్... భారత్‌లో కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

ప్రపంచవ్యాప్తంగా హార్రర్, థ్రిల్లర్ జోనర్స్‌ని ఇష్టపడని వారుండరు. ఇలాంటి వారి కోసమే మేకర్స్ సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సరికొత్త కాన్సెప్ట్స్‌ని తీసుకొస్తుంటారు. ఈ విషయంలో హాలీవుడ్ మేకర్స్ కాస్త ముందుంటారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సరికొత్త థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ కారణంగా వరల్డ్ వైడ్‌గా హాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఓ హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ చిన్న థ్రిల్లర్ మూవీ వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం 10 కోట్ల రూపాయలతో తీస్తే ఏకంగా 1000 కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది. అదే అబ్సెషన్ మూవీ. వరల్డ్ వైడ్‌గా సంచలనం సృష్టించిన ఈ చిన్న సినిమా మే 29న భారత్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో మనదేశంలో అబ్సెషన్ ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది? భారతీయుల నుంచి ఈ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది? అనేది పరిశీలిస్తే..

అబ్సెషన్ తారాగణం
ఆ సినిమా ఏదో కాదు.. హాలీవుడ్‌లో తెరకెక్కిన అబ్సెషన్. క్యాప్‌స్టోన్ పిక్చర్స్, టీ షాప్ ప్రొడక్షన్స్, బ్లూమ్‌హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జేమ్స్ హారీస్, హేలీ నికోల్ జాన్సన్, క్రిస్టియన్ మెర్‌క్యూరి, రోమన్ వియారిస్‌లు ఈ సినిమాను నిర్మించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు. మైఖేల్ జాన్స్‌టన్, ఇండే నవరాట్టె, కూపర్ టామిల్సన్, మెగన్ లాలెస్, అండీ రిచ్టెర్, డారిన్ టూండర్ తదితరులు అబ్సెషన్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. టేలర్ సెలమన్స్ సినిమాటోగ్రాఫీ అందించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాక్ బార్వెల్ సంగీత దర్శకత్వం వహించారు.

Obsession Box Office Curry Barker s Movie earning over 1000 crore worldwide Opens Strong in India

అబ్సెషన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమాను 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. సైకో హార్రర్, సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఫోకస్ ఫీచర్స్ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ... యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ విదేశాల్లోనూ రిలీజ్ చేసింది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 5న అబ్సెషన్ మూవీని తొలిసారిగా ప్రదర్శించారు. ఈ ఏడాది మే 15న అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

అబ్సెషన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 78.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో 744 కోట్ల రూపాయలు) వసూలు చేయగా.. విదేశాల్లో 22.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 211 కోట్ల రూపాయలు) చొప్పున వరల్డ్ వైడ్‌గా 100,600 మిలియన్ డాలర్లు (1016 కోట్ల రూపాయలు) వసూలు చేసింది అబ్సెషన్. తద్వారా బడ్జెట్ కంటే ఏకంగా 125 రెట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్చంలో ముంచెత్తింది. తద్వారా మైఖేల్, ద డెవిల్ వేర్స్ ప్రాడా 2 వంటి చిత్రాల సరసన చేరింది.

అబ్సెషన్ ఇండియా వసూళ్లు
అబ్సెషన్ మే 29న ఇండియాలో విడుదలైంది. తొలి రోజున మనదేశంలో 1.75 కోట్ల రూపాయలు నెట్.. 2.54 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు అబ్సెషన్‌కు ఇప్పటి వరకు 296 షోలు ప్రదర్శితమవ్వగా.. ఇప్పటి వరకు 37 లక్షల రూపాయలు వసూలు చేసింది. తొలివారం ఈ సినిమా ఇండియాలో 5 నుంచి 7 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Read more about: box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X