Odela 2 Day 1 Collections: ఓదెల 2కు మైండ్ బ్లాంక్ బిజినెస్.. తమన్నా మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో నటించిన ఓదెల 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వశిష్ట సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. డీ మధు నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
తమన్నా నటించిన ఓదెల 2 సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోకి కూడా డబ్ చేశారు. ఈ సినిమాను కాశీ, కుంభమేళా లాంటి ప్రాంతాల్లో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. అంతేకాకుండా భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కూడా చేశారు. దాంతో ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో రూపొందించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగులో 2021 సంవత్సరంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను ఆత్మకు పరమాత్మకు జరిగిన సంఘర్షణ అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ చిత్రంలో నాగసాధువుగా తమన్నాను ప్రత్యేకంగా చూపించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 11 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఓదెల 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం హక్కులను సుమారుగా 4 కోట్ల రూపాయలకు, సీడెడ్ 1 కోటి రూపాయలకు, ఆంధ్రా 4 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 9 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కన్నడ, ఇతర భాషలు, ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బిజినెస్ 11 కోట్లుగా పేర్కొన్నారు. ఈ సినిమా 12 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేట్రికల్ జర్నీని స్టార్ట్ చేసింది.
ఓదెల 2 సినిమా టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ వర్కవుట్ కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది. దాంతో తెలంగాణలో మోస్తారు ఆక్యుపెన్సీ కనిపించింది. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో పర్వాలేదనే విధంగా ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడం వల్ల కొంత అటు ఇటుగా ఆక్యుపెన్సీ నమోదు అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తున్నది.
ఇక ఓదెల 2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కంటే.. కరెంట్ బుకింగ్‌కు ఎక్కువగా స్పందన కనిపించింది. మౌత్ టాక్ పాజిటివ్‌గా స్ప్రెడ్ అయితే ఈ మూవీకి ఓ రేంజ్ వసూళ్లు రాబట్టవచ్చు. తొలి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇంకా పాజిటివ్‌గా సినిమాపై రిపోర్టు పెరిగితే.. కలెక్షన్లు కూడా పెరుగడానికి ఛాన్స్ ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











