Odela 2 Day 2 Collections: షాకింగ్‌గా ఓదెల 2 కలెక్షన్లు.. తమన్నా మూవీ లాభాల్లోకి రావాలంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, వశిష్ట సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటించిన ఓదెల 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించారు. డీ మధు నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తమన్నా నటించిన ఓదెల 2 సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోకి కూడా డబ్ చేశారు. ఈ సినిమాను కాశీ, కుంభమేళా లాంటి ప్రాంతాల్లో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. అంతేకాకుండా భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కూడా చేశారు. దాంతో ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో రూపొందించారు. ప్రమోషన్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి మొత్తంగా ఈ సినిమా 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Odela 2 Day 2 Collections

ఓదెల 2 సినిమా ప్రమోషన్స్ భారీగా నిర్వహించడంతో మంచి బజ్ ఏర్పడింది. బిజినెస్ వర్గాలు కూడా రికార్డు మొత్తానికి రైట్స్ కొనుగోలు చేశారు. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 10 కోట్ల రూపాయలతో, కన్నడ, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ హక్కులు సుమారుగా 2 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 900 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఓదెల సినిమాపై ఏర్పడిన బజ్‌ తొలి రోజు వసూళ్లకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణలో సుమారుగా 1 కోటి రూపాయల గ్రాస్, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిపి మరో 50 లక్షల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారుగా 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను తొలి రోజు కలెక్ట్ చేసింది.

ఇక ఓదెల 2 సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా జోష్‌ను ప్రదర్శించలేదు. కానీ నిలకడగా కలెక్షన్లను రాబట్టే ప్రయత్నం చేస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రెండో రోజు 35 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగింది. ఈ సినిమా 2వ రోజు ఏపీ, తెలంగాణలో సుమారుగా 75 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ కనిపించింది. ఇక ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా 1.25 నుంచి 1.5 కోట్ల రాబట్టే అవకాశం లేకపోలేదని వెల్లడించారు. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 3 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఓదెల 2 సినిమాకు భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ సినిమాలో లాభాల జోన్‌లోకి ప్రవేశించాలంటే.. కనీసం 24 కోట్ల గ్రాస్ వసూళ్లను, 12 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను పంచి పెడుతుందా? అనేది కొద్ది రోజులు ఆగితే తెలియడం ఖాయంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X