Odela 2 Day 3 Collections : కోలుకోని ఓదెల 2 .. వీకెండ్‌లోనూ అట్టర్ ఫ్లాప్, మూడో రోజు ఎన్ని కోట్లంటే?
గతంలో హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా తెరేకెక్కిన ఓదెల 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17న విడుదలైంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలకపాత్ర పోషించగా.. వశిష్ట సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మలు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. డీ మధు నిర్మాణం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఓదెల 2 బడ్జెట్ ఎంత ( Odela 2 Budget)?
ఓదెల 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ విషయంలోనూ ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషన్, ఇతర ఖర్చులు కలిపి ఓదెల 2 చిత్రాన్ని దాదాపు 25 కోట్ల రూపాయలతో రూపొందించినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
ఓదెల 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Odela 2 Break Even Target)?
వారణాసి తదితర ప్రాంతాల్లో షూటింగ్‌తో పాటు భారీ ప్రచార కార్యక్రమాలు, టీజర్, ట్రైలర్ల కారణంగా ఓదెల 2 సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తగినట్లుగానే తమన్నా సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 10 కోట్ల రూపాయలు, కన్నడ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు సుమారుగా 2 కోట్ల రూపాయల మేర మొత్తంగా 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓదెల 2 లాభాల జోన్‌లోకి ప్రవేశించాలంటే.. కనీసం రూ.24 కోట్ల గ్రాస్ వసూళ్లను, రూ.12 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందని విలువ కట్టారు.
గత రెండు రోజుల వసూళ్లు ( Odela 2 two Days Collections)
భారీ అంచనాల మధ్య ఓదెల 2 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 900 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు తొలిరోజున రూ.85 లక్షల ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే సినిమాపై ఉన్న అంచనాలకు వచ్చిన కలెక్షన్స్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. ఇక రెండో రోజైనా ఓదెల 2 పుంజుకుంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ రెండో రోజు కూడా షాకిచ్చేలా వసూళ్లు వచ్చాయి. శుక్రవారం (2వ రోజు) ఈ చిత్రానికి రూ.71 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. రెండు రోజుల వరకు తమన్నా భాటియా, హెబ్బా పటేల్ సినిమాకి ఇండియా వైడ్ నికరంగా రూ.కోటి 56 లక్షల నెట్ వచ్చినట్లుగా సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది.
ఓదెల 2కు మూడో రోజు కలెక్సన్స్ అంచనా ( Odela 2 Day 3 Expected Collections )
వీకెండ్ , వేసవి సెలవుల కారణంగా ఓదెల 2కి ఆక్యూపెన్సీ బాగుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మూడో రోజైన శనివారం సాయంత్రం 6 గంటల వరకు తెలుగులో 16.41 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. హైదరాబాద్‌లో 243 షోలు, బెంగళూరులో 53 షోలు, విశాఖలో 67 షోలు, విజయవాడలో 44 షోలు పడ్డాయి. మూడో రోజు ఓదెల 2 రూ.70 నుంచి రూ.80 లక్షల రేంజ్‌లో కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి తమన్నా మూవీ ఏ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











