Odela 2 Day 4 Collections : ఓదెల 2కు 4 రోజుల కలెక్షన్లు.. తమన్నా మార్కెట్ ఇంతేనా?

ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే ఓదెల 2. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 17న విడుదలైంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నాగసాధువుగా అలరించింది. వశిష్ట సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మలు ముఖ్యపాత్రల్లో నటించారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. డీ మధు నిర్మాణం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? 4 రోజుల కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఓదెల 2 బడ్జెట్ ఎంత ( Odela 2 Budget)?
తమన్నా భాటియా ఓదెల 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ విషయంలో గ్రాంగ్ గా నిర్మించారు. ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, పారితోషికం, ప్రమోషన్ కలిపి దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్ అయ్యింది.

Odela 2 Movie Day 4 Box Office Collections Worldwide

ఓదెల 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Odela 2 Break Even Target)?
తమన్నా మెయిన్ లీడ్ కావడంతో ఓదెల 2 సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా రూ.10 కోట్లు, కన్నడ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు సుమారుగా రూ.2 కోట్ల మేర వసూలైంది. మొత్తంగా రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కనీసం రూ.24 కోట్ల గ్రాస్ వసూళ్లను, రూ.12 కోట్ల నెట్ కలెక్షన్లను రాబడితేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కానుందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

3 రోజుల వసూళ్లు ( Odela 2 two Days Collections)
ఓదెల 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా 900 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలిరోజున రూ.85 లక్షల ఇండియా నెట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే సినిమాపై ఉన్న అంచనాలకు వచ్చిన కలెక్షన్స్‌కు ఏమాత్రం సంబంధం లేదు. ఇక 2వ రోజు శుక్రవారం రూ.71 లక్షల ఇండియా నెట్, 3వ రోజు రూ.63 లక్షల ఇండియా నెట్ వసూలైంది. దీంతో 3వ రోజు వరకు కేవలం రూ.5 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ పండింతులు వెల్లడించారు.

ఓదెల 2కు 4వ రోజు కలెక్షన్స్ ( Odela 2 Day 4 Collections)
ఈ సినిమాకు వచ్చిన హైప్ కు వీకెండ్ లో మాత్రం దుమ్ములేపాల్సింది. వీకెండ్, వేసవి సెలవులతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాలి. కానీ వసూళ్లు దారుణంగా ఉన్నాయి. మొదటి వారం పూర్తవ్వకుండానే వసూళ్లు భారీగా పడిపోయాయి. 4వ రోజు కేవలం రూ.61 లక్షలు ఇండియా నెట్ మాత్రమే అందుకుంది. నాలుగు రోజుల్లో కలిసి మొత్తంగా రూ.2.8 కోట్లు మాత్రమే ఇండియా నెట్ అందుకుందని సాక్ నిల్క్ గణంకాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటి వరకు మొత్తంగా రూ.6 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

Disclaimer: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్‌ రిపోర్టులకు సంబంధించిన సమాచారం https://www.sacnilk.com/, ప్రొడక్షన్ హౌస్‌‌లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల‌కు సంబంధించి వెల్లడించే రిపోర్టులకు ఫిల్మీబీట్ ఎలాంటి బాధ్యత వహించదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X