Odela 2 Closing Collections : ఓదెల 2 హిట్టా? ఫట్టా? తమన్నా మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మధు క్రియేషన్స్ , సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్‌పై సంపత్ నంది, డి మధు ఓదెల 2 చిత్రాన్ని నిర్మించారు. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహాలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17వ తేదీన ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? ఈ సినిమాకు లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..

హెబ్బా పటేల్, వశిష్టల కెరీర్‌ ఊగిసలాటకు గురి అవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా హిట్ సాధించాల్సిన సమయంలో ఓదెల 2 మూవీతో వచ్చారు. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలకపాత్ర పోషించడంతో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఓదెల 2పై మంచి బజ్ నెలకొంది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

odela 2 Telugu Movie Box Office Closing Collections Worldwide How much loss or profit for tamannaah Bhatia Movie

ఓదెల 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషన్, ఇతర ఖర్చులు కలిపి ఓదెల 2 చిత్రాన్ని దాదాపు 25 కోట్ల రూపాయలతో రూపొందించినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

వారణాసి, హైదరాబాద్‌ సహా తదితర ప్రాంతాల్లో భారీ ప్రచార కార్యక్రమాల కారణంగా ఓదెల 2 సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తగినట్లుగానే తమన్నా సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 10 కోట్ల రూపాయలు, కన్నడ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు సుమారుగా 2 కోట్ల రూపాయల మేర మొత్తంగా 12 కోట్ల రూపాయల మేర వ్యాపారం చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓదెల 2 లాభాల్లోకి రావాలంటే రూ.24 కోట్ల గ్రాస్ , రూ.12 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

భారీ అంచనాల మధ్య ఓదెల 2 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 900 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు తొలిరోజున రూ.87 లక్షల ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు రూ.77 లక్షల నెట్, మూడో రోజు రూ.68 లక్షల నెట్, నాలుగో రోజు రూ.80 లక్షల నెట్, ఐదో రోజున రూ.47 లక్షల నెట్, ఆరో రోజున రూ.42 లక్షల నెట్, ఏడో రోజున రూ.45 లక్షల నెట్, ఎనిమిదో రోజున రూ.35 లక్షల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఓదెల 2. మొత్తంగా 8 రోజుల వరకు తెలుగులో రూ.4.81 కోట్లు, హిందీలో రూ.28 లక్షల చొప్పున ఇండియాలో రూ.4 కోట్ల నెట్, 5.09 కోట్ల గ్రాస్ అందుకుంది ఓదెల 2. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్‌లో వచ్చిన రూ.30 లక్షలు కలిపి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.39 కోట్ల కలెక్షన్స్ ఆర్జించింది.

ఓదెల 2 సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా కేవలం 18 శాతం రికవరీ మాత్రమే సాధించి, సుమారుగా 18 కోట్ల రూపాయల మేర నష్టంతో ముగిసే అవకాశం ఉంది. ఓవరాల్‌ బడ్జెట్ ప్రకారం చూస్తే.. ఈ సినిమా స్వల్ప లాభాల్లోనే ముగిసే అవకాశం కనబడుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ఈ నష్టాన్ని కొంత మేరకు తగ్గించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X