For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాప్ టాక్‌ను ఎదురించిన ఒడియాన్.. సత్తా చాటిన మోహన్‌లాల్.. ఎన్ని కోట్ల వసూళ్లంటే!

    |

    మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన ఒడియాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. రెండు రోజుల్లోనే దిమ్మ తిరిగే వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.40 కోట్లకు చేరువైంది. అయితే ఈ సినిమాపై సినీ విమర్శకులు పెదవి విరిచినా భారీగా కలెక్షన్లు సాధించడం గమనార్హం.

    మరో బాహుబలి అనేంత రేంజ్‌లో

    మరో బాహుబలి అనేంత రేంజ్‌లో

    మోహన్ లాల్ నటించిన ఒడియాన్ చిత్రం విడుదలకు ముందు మరో బాహుబలిగా పేరు తెచ్చుకొన్నది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టుగానే భారీగా ఒపెనింగ్స్ నమోదయ్యాయి. తొలి రోజున విడుదలైన ప్రతీ చోట వందశాతం అక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

    రెండు రోజుల్లోనే రూ.40 కోట్లు

    రెండు రోజుల్లోనే రూ.40 కోట్లు

    గత రెండు రోజుల్లో ఒడియాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రెండు రోజుల్లోనే రూ.40 కోట్లు సాధించింది. శనివారం రోజున ఏకంగా రూ.10 కోట్లు రాబట్టడంతో మోహన్ లాల్ స్టామినాకు అద్దం పట్టింది. గత రెండు రోజుల్లో ఈ చిత్రం 36.27 కోట్లు సాధించింది.

    రాష్ట్రాల వారీగా వసూళ్లు

    రాష్ట్రాల వారీగా వసూళ్లు

    ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఒడియాన్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. కేరళలో ఈ చిత్రం రూ.7.25 కోట్లు సాధించింది. కర్ణాటకలో రూ.90 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో రూ.85 లక్షలు, తమిళనాడులో రూ.51 లక్షలు రాబట్టింది. భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రం రూ.25 లక్షలు వసూలు చేసింది.

    ఓవర్సీస్ మార్కెట్‌ వద్ద

    ఓవర్సీస్ మార్కెట్‌ వద్ద

    దేశీయ బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ.9.76 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఒడియాన్ తొలిరోజు రూ.16.50 కోట్లు, రెండో రోజున రూ.18.3 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.26.27 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు ట్వీట్ చేశారు.

    ప్రేక్షకుల విశేష స్పందన అంటూ

    ప్రేక్షకుల విశేష స్పందన అంటూ

    ఓవర్సీస్ మార్కెట్‌లో ఒడియాన్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రానికి అనూహ్య స్పందన రావడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. తొలి రోజునేరూ.16.51 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను విజయపథం వైపు నడిపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

    రివ్యూలపై డైరెక్టర్ మండిపాటు

    రివ్యూలపై డైరెక్టర్ మండిపాటు

    ఇదిలా ఉండగా, ఒడియాన్ చిత్రంపై ప్రతికూల రివ్యూలు రాసిన వారిపై దర్శకుడు నిప్పులు చెరిగారు. సినిమాపై, మోహన్ లాల్‌పై కొందరు గిట్టని వాళ్లు దుష్ర్పచారం చేస్తున్నారు అని దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ మండిపడ్డారు. ఒడియాన్‌పై చెడు ప్రచారం చేయొద్దని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    English summary
    Mohanlal's Odiyan has collected over Rs 10 crore gross at the worldwide box office on Saturday. Its two day total collection has reached Rs 36.27 crore gross in the global market.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X