OG 5 Days Overseas Collections: ఓవర్సీస్‌లో ఓజీ సరికొత్త రికార్డులు.. యూఎస్, యూకేలో పవన్ బాక్సాఫీస్ విధ్వంసం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబడుతున్నది. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించి ఈ సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత అదే జోష్‌ను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కొనసాగిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్‌లో సంచలన రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
OG చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ బిజినెస్ 3 మిలియన్ డాలర్ల మేర జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 5 మిలియన్ డాలర్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 9 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

అయితే అమెరికాలో ఈ సినిమా రిలీజ్‌కు ముందే 3 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం 5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 45 కోట్ల రూపాయలు రాబట్టింది అని అమెరికా డిస్టిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది. అయితే ఈ వసూళ్లలో మేజర్‌గా తెలుగు వెర్షన్ ద్వారానే రాబట్టడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.
ఇక 2025 లో రిలీజైన సినిమాలో ఓజీ చిత్రం ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఇటీవల రిలీజైన కూలీ చిత్రం అన్ని భాషల్లో కలిపి లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్ 7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం 4.33 మిలియన్ డాలర్లు, మిరాయ్ చిత్రం 3 మిలియన్లు, లోక చిత్రం 2.10 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాలకంటే భిన్నంగా కేవలం తెలుగు వెర్షన్‌లోనే 5 మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు చెప్పుకొంటున్నారు.
ఇక ఈ చిత్రం గ్రేట్ బ్రిటన్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం యూకేలో మొత్తంగా 350K పౌండ్స్ వసూలు చేసింది. సాధారణంగా తెలుగు సింగిల్ లాంగ్వేజ్ వెర్షన్ మూవీ అత్యధికంగా 240K పౌండ్లు వసూలు చేసిన రికార్డు ఉంది. అయితే ఈ సినిమా కేవలం తెలుగు భాషల్లోనే రిలీజై.. ఎలాంటి ఐమాక్స్ వెర్షన్ షోలు లేకుండా ఈ రేంజ్‌లో వసూలు చేయడం గొప్ప అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఓజీ చిత్రం జోరును కొనసాగిస్తున్నది. పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ స్టామినాకు ఈ సినిమా కలెక్షన్లు అద్దం పడుతున్నాయి. ఆస్ట్రేలియాలో 556K ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. న్యూజిలాండ్‌లో ఈ చిత్రం 38 వేల డాలర్లు వసూలు చేసింది. ఈ రెండు దేశాల్లో కలిపి ఈ చిత్రం 589K ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. 5వ రోజు కూడా అన్ని దేశాల్లో స్ట్రాంగ్‌గా కలెక్షన్లు నమోదు అవుతున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











