OG 15 Days Box Office: ఓజీ ప్రభంజనం.. 15రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

OG Box Office Collections Worldwide: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఓజీ'(They Call Him OG).ఈ యాక్షన్ ఎంటరటైన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఓజీ మూవీ తెలుగు చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓజీ ప్రీమియర్లు, రోజు వారి కలెక్షన్లు ? 15వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "OG" విడుదలైన రోజే బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని పవన్ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచేసింది. థియేటర్ల వద్ద అభిమానులు పవర్ స్టార్ ఫోటోలు, కటౌట్స్‌తో ఊరంతా పండగ చేసుకుంటున్నారు. జెర్సీలు, ఫైర్ వర్క్స్, బ్యానర్లు ఓజీ రిలీజ్ డే నిజంగా పవన్ ఫెస్టివల్ మూడ్‌ను గుర్తు చేసింది. "ఇది పవర్ స్టార్ రాకింగ్ రిటర్న్!" అని సోషల్ మీడియా అంతా నిండిపోయింది.

OG Day 15 Expected Box Office Collections Worldwide Pawan Kalyan movie verge of the Break Even Target

భారీ బడ్జెట్
DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. సుమారు ₹250 కోట్ల ఖర్చుతో రూపొందిన OG లో ప్రతి సీన్‌లో కూడా గ్రాండ్‌నెస్ కనిపిస్తోంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస సంయుక్తంగా అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహించారు. ఎస్‌.ఎస్‌. థమన్ అందించిన మ్యూజిక్ థియేటర్లలో థండర్‌ ఎఫెక్ట్‌ను సృష్టిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించగా, విదేశీ షెడ్యూల్స్‌, పెద్ద సెట్స్‌, మాస్ మేకింగ్‌తో సుజీత్ తన డైరెక్షన్ పవర్‌ను చాటాడు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఉపేంద్ర లిమయి వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రకు ప్రత్యేక వెయిట్ ఉండటమే కాకుండా, పవన్ ఎంట్రీ సీన్స్ మాత్రం థియేటర్‌ను షేక్ చేసేలా రూపొందించబడ్డాయి. ఫ్యాన్స్ కోసం పవర్ ప్యాక్ యాక్షన్, మాస్ డైలాగ్స్, థమన్ మ్యూజిక్ అన్ని కలిస్తేనే పవన్ కలర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. నిజంగా "OG" పవన్ కళ్యాణ్ పవర్ పుల్ యాక్షన్ ఎంటర్టైనర్.

OG సినిమా రిలీజ్ కంటే ముందే ట్రేడ్ సర్కిల్స్‌లో రికార్డులు సృష్టించింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ ₹194 కోట్ల మార్క్‌ను దాటింది. ఇది పవన్ సుజీత్ కాంబినేషన్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌కి నిదర్శనమని చెప్పవచ్చు. పూర్తి రికవరీ కోసం థియేట్రికల్ షేర్‌గా కనీసం ₹200 కోట్లు రావాలి.. అంటే వరల్డ్‌వైడ్ గ్రాస్ ₹400 కోట్లకు పైగా చేరుకోవాలి.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ
ఓజీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సంబరాలు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఓజీ కలెక్షన్ల సునామీకి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రేమియర్స్ ద్వారానే సుమారు రూ.22 కోట్లు రాబట్టిన ఓజీ, మొదటి రోజు రూ.67 కోట్లు, రెండో రోజు రూ.19 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు ( ఇండియా వైడ్ గా నెట్) వసూలు చేసింది. ఐదో రోజు నుండి ఏడో రోజు వరకు కూడా కలెక్షన్‌ జోరు కొనసాగింది. వరుసగా రూ. 7.5 కోట్లు, రూ. 7 కోట్లు, రూ. 6.75 కోట్లు, ఎనిమిదో రోజు రూ 7.5 కోట్లు వసూలు చేసి, మొదటి వారం మొత్తంగా రూ.169.3 కోట్లు ( ఇండియా వైడ్ నెట్) సాధించింది.

కాంతార సినిమా విడుదలతో కొంత ప్రభావం ఓజీ స్పీడ్ కాస్త తగ్గింది. తొమ్మిదో రోజు రూ.4.75 కోట్లు, పదో రోజు రూ.4.6 కోట్లు రాబట్టి, 10 రోజుల్లోనే రూ.179 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటింది. వీకెండ్‌లో మళ్లీ పవన్ ప్రభావం కనిపించింది. 11వ రోజు రూ.4.35 కోట్లు, 12వ రోజు రూ.2 కోట్లు, 13వ రోజు రూ.1.8 కోట్లు, 14వ రోజు రూ.1.18 కోట్లు వసూలు చేసి, రెండు వారాల్లో ఇండియా వైడ్‌గా రూ.186.7 కోట్లు (నెట్), గ్రాస్ రూ.222.91 కోట్లు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం OG దూకుడు ఇంకా ఎక్కువగా ఉండి, వ‌రల్డ్‌వైడ్ గ్రాస్ రూ.315.51 కోట్లు చేరినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

15వ రోజు కలెక్షన్ రిపోర్ట్
తాజాగా 15వ రోజు కూడా OG కలెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇండియా వైడ్‌గా రూ.1.2 కోట్ల నెట్, రూ.1.48 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.0.31 కోట్ల నెట్ వసూలు చేయగా, గ్రాస్ కలెక్షన్ రూ.1.79 కోట్లు చేరిందని అంచనా. దీంతో OG మొత్తం ఇండియా వైడ్ రూ.187.9 కోట్లు (నెట్), రూ.224.39 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ.317 కోట్ల మార్క్‌ చేరువలో ఉంది. గత వారం విడుదలైన 'కాంతార' పోటీ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రభావం తగ్గలేదు. OG ఇప్పటివరకు పవన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పవర్‌ఫుల్ యాక్షన్‌, థమన్ మ్యూజిక్‌, సుజీత్ ట్రీట్‌మెంట్‌ కలిసిపోయి OGని పవర్ స్టార్ కెరీర్‌లో మైలురాయిగా నిలబెట్టాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X