OG 16 Days Box Office: బాక్సాఫీస్ వద్ద ‘ఓజీ’ విధ్వంసం.. 16 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

OG Box Office Collections Worldwide: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ (They Call Him OG)'సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ఫస్ట్ షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. పవన్ అభిమానుల పెద్ద పండుగలాగా మారిపోయింది. సోషల్ మీడియా అంతా .. ఇది పవన్ కళ్యాణ్ రాకింగ్ రిటర్న్! అనే కామెంట్స్, హ్యాష్ ట్యాగ్స్ తో నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఓజీ ప్రీమియర్లు, రోజు వారి కలెక్షన్లు ? 16 వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

ఓజీ మూవీని DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై DVV దానయ్య నిర్మించగా, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. దాదాపు రూ.250 కోట్ల ఖర్చుతో రూపొందిన ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండ్‌నెస్ కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్లు రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస ఇచ్చిన విజువల్స్ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ అదుర్స్. మరో వైపు థమన్ అందించిన సంగీతం థియేటర్లలో థండర్ ఎఫెక్ట్‌ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్‌తోపాటు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అజయ్ ఘోష్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు.

OG Day 16 Expected Box Office Collections Worldwide Pawan Kalyan movie verge of the Break Even Target

'ఓజీ' రిలీజ్‌కు ముందే ట్రేడ్ సర్కిల్స్‌లో హవా మొదలైంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 194 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇది పవన్-సుజీత్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌కు నిదర్శమని చెప్పవచ్చు. పూర్తి రికవరీ కోసం కనీసం రూ. 200 కోట్ల థియేట్రికల్ షేర్ అవసరం కాగా, వ‌రల్డ్‌వైడ్ గ్రాస్‌గా సుమారు రూ. 400 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు.

ఈ క్రమంలో సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి దుమ్ము రేపుతోంది. ప్రేమియర్స్ ద్వారానే రూ. 22 కోట్లు రాబట్టిన 'ఓజీ' ఫస్ట్ డే రూ. 67 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు రూ. 19 కోట్లు, మూడో రోజు రూ. 18 కోట్లు, నాలుగో రోజు మరోసారి రూ 19 కోట్లు వసూలు చేసింది. ఇక వీకెండ్ ముగిసే సరికి మొత్తం రూ .169.3 కోట్లు (ఇండియా వైడ్ నెట్) సాధించింది.

అంతే కాదు.. తర్వాతి వారంలో కూడా వసూళ్ల జోరు కొనసాగింది. 'కాంతార' సినిమా విడుదలతో కొంత ప్రభావం పడినా, పవన్ మానియా తగ్గలేదు. తొమ్మిదో రోజు రూ. 4. 75 కోట్లు, పదో రోజు రూ. 4.6 కోట్లు రాబట్టింది. ఇలా పది రోజుల్లోనే రూ. 179 కోట్లు దాటేసింది. ఇక రెండో వారంలో కూడా ఓజీ వసూళ్లు జోరుగా కొనసాగాయి. పదకొండో రోజు రూ. 4.35 కోట్లు, పన్నెండో రోజు రూ. 2 కోట్లు, పదమూడో రోజు రూ. 1.8 కోట్లు, పద్నాలుగో రోజు రూ 1.18 కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తం రెండు వారాల్లో ఇండియా వైడ్‌గా రూ . 188 కోట్లు (నెట్), గ్రాస్‌గా రూ. 226 కోట్లు, వ‌రల్డ్‌వైడ్ గ్రాస్‌గా రూ. 316 కోట్ల వరకు రాబట్టినట్టు ట్రేడ్ టాక్.

16 వ రోజు కలెక్షన్ రిపోర్ట్
తాజాగా ఓజీ 16వ రోజు కలెక్షన్స్ చూస్తూ కలెక్షన్ స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. ఇండియా వైడ్‌గా రూ.1.1 కోట్ల నెట్, రూ.1.42 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.0.30 కోట్ల నెట్ వసూలు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూ. 2 కోట్లు చేరిందని అంచనా. దీంతో OG మొత్తం ఇండియా వైడ్ రూ.189 కోట్లు (నెట్), రూ.228 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ.318 కోట్ల మార్క్‌ చేరువ కానున్నది.

గత వారం విడుదలైన 'కాంతార' పోటీ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రభావం తగ్గలేదు. ఇక రేపటి నుంచి వీకెండ్ మొదలు కావడంతో ఓజీ కలెక్షన్స్ పుంజుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏదిఏమైనా.. పవన్ కెరీర్ లో ఓజీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. పవర్‌ఫుల్ యాక్షన్‌, థమన్ మ్యూజిక్‌, సుజీత్ ట్రీట్‌మెంట్‌ కలిసిపోయి ఓజీని పవర్ స్టార్ కెరీర్‌లో మైలురాయిగా నిలబెట్టాయని చెప్పడం ఎలాంటి అతియోశక్తి లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X