OG 18 Days Box Office: బాక్సాఫీస్ వద్ద ‘ఓజీ’వీరంగం.. 18 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
OG Box Office Collections Worldwide: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (OG).ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా విడుదలైన రోజే అభిమానులు థియేటర్లను పవర్ ఫెస్టివల్ వేదికగా మార్చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇది పవర్ స్టార్ రిటర్న్ కాదు... అంటూ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ అయింది. గత 18 రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఓజీ తన సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఓజీ ప్రీమియర్లు, రోజు వారి కలెక్షన్లు ? 18వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్.. గ్రాండ్ మేకింగ్
ప్రముఖ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఓజీ.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది. సుమారు రూ. 250 కోట్ల ఖర్చుతో రూపొందించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంసలు కలిసి అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహించారు. సంగీతం అందించిన ఎస్.ఎస్. థమన్ థియేటర్లలో థండర్ లాంటి ఎనర్జీని సృష్టించాడు. సుజీత్ దర్శకత్వం ఈ సినిమాకు హైలెట్. అలాగే ప్రతి సీన్‌లో పవన్ కళ్యాణ్‌కు తగిన స్టైలిష్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో పాటు, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాడు. విదేశీ లొకేషన్లు, భారీ సెట్స్, మాస్ మేకింగ్ అన్ని కలిసి ఓజీ మూవీని ఓ అద్బుతంగా మార్చారు.

పవర్ ప్యాక్ కాస్టింగ్
పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఉపేంద్ర లిమయి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్రకు ప్రత్యేక వెయిట్ ఉండటమే కాకుండా, పవన్ ఎంట్రీలు థియేటర్లను షేక్ చేసేలా రూపొందించబడ్డాయి. మాస్ డైలాగ్స్, థమన్ మ్యూజిక్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అని సినిమాకు హైలెట్.
ప్రీ-రిలీజ్ రికార్డులు
OG సినిమా విడుదలకు ముందే రికార్డులు బద్దలయ్యాయి. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 194 కోట్ల మార్క్ దాటింది. పవన్ సుజీత్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్ రికవరీకి రూ. 200 కోట్ల షేర్ అవసరమని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, OG ఆ దిశగా వేగంగా పయనిస్తోంది. వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 400 కోట్లను టచ్ చేయడం కేవలం టైమ్ మేటర్ మాత్రమే అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.
ఓజీ వసూళ్ల సునామీ
ఓజీ విడుదలైన తొలి షో నుంచే బాక్సాఫీస్ వద్ద హిస్టారిక్ కలెక్షన్స్ సాధించింది. ప్రేమియర్స్ ద్వారానే రూ. 22 కోట్లు రాబట్టి, ఫస్ట్ డే నెట్ కలెక్షన్‌గా రూ. 67 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు రూ. 19 కోట్లు, మూడో రోజు రూ. 18 కోట్లు, నాలుగో రోజు మరో రూ. 19 కోట్లు వసూలు చేసింది. ఇలా మొదటి వారం మొత్తం రూ.169.3 కోట్లు (ఇండియా వైడ్ నెట్), గ్రాస్ రూ. 226 కోట్లు సాధించింది.కాంతార సినిమా విడుదలతో కొంత ప్రభావం ఉన్నప్పటికీ, OG జోరు తగ్గలేదు. 10 రోజుల్లోనే ₹179 కోట్ల నెట్ కలెక్షన్ దాటింది. తరువాతి రోజుల్లోనూ పవన్ మానియా కొనసాగుతూ, 14 రోజుల్లో ఇండియా వైడ్ నెట్ ₹188 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ ₹316 కోట్లు దాటినట్టు సమాచారం.
18వ రోజు కలెక్షన్ రిపోర్ట్
ఇక ఓజీ 18వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 17 రోజు నేషనల్ వైడ్ గా 1.47 కోట్లు ( నెట్) వసూలు చేయగా.. నేడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి. ఓజీ 18 వ రోజు ఇండియా వైడ్‌గా రూ. 1.5 కోట్ల నెట్, రూ. 1.80 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.0.50 కోట్ల నెట్ వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూ. 2.5 కోట్లు చేరిందని అంచనా.
దీంతో OG మొత్తం ఇండియా వైడ్ రూ. 193కోట్లు (నెట్), రూ.234 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ.325 కోట్ల మార్క్ చేరువ కానున్నట్టు అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. వీకెండ్ కావడంతో ఓజీ కలెక్షన్స్ మరింత పుంజుకున్నాయి. త్వరలోనే రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నైజంలో బ్రేక్ ఈవెన్ క్రాస్ అయినట్టు ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











