OG 19 Days Box Office: ‘ఓజీ’బాక్సాఫీస్.. 19 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

OG Box Office Collections Worldwide: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (They Call Him OG)" బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులను క్రియేట్ చేస్తూ.. కాసుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని పవన్ అభిమానుల్లో జోష్ పెంచింది. ప్రతి థియేటర్ లో పవర్ స్టార్ ఫెస్టివల్ లాగా మారిపోయింది. అభిమానులు కటౌట్స్, బ్యానర్లు, ఫైర్‌వర్క్స్‌తో ఊరంతా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓజీ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంత? రోజు వారి కలెక్షన్లు ? 19వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్‌తో పవర్ ప్యాక్ యాక్షన్
ప్రముఖ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై DVV దానయ్య నిర్మించిన ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలిచింది. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన "ఓజీ"లో ప్రతి సీన్ ను హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస సంయుక్తంగా అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహించారు. ఇక మ్యూజిక్ లెజెండ్ ఎస్‌.ఎస్‌. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో థండర్ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫైట్స్‌ అన్ని హాలీవుడ్ లెవెల్‌లో ఉండటంతో పవన్ అభిమానులు పవర్ స్టార్ రిటర్న్ అంటున్నారు.

OG Day 19 Expected Box Office Collections Worldwide Pawan Kalyan movie verge of the Break Even Target

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమయి వంటి ప్రముఖ నటులు నటించారు. ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉండటంతో సినిమాకు రియలిస్టిక్ టచ్ వచ్చింది. పవన్ ఎంట్రీ సీన్స్, యాక్షన్ బ్లాక్స్, మాస్ డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబో మూవీ అనగానే.. ట్రేడ్ సర్కిల్స్‌లో ఓజీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 194 కోట్ల మార్క్ దాటింది. పూర్తి రికవరీ కోసం కనీసం రూ. 200 కోట్ల థియేట్రికల్ షేర్ రావాలి, అంటే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 400 కోట్లకు పైగా చేరాలి. ఆ దిశగా "ఓజీ" వేగంగా దూసుకుపోతోంది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ
'ఓజీ' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రేమియర్స్ ద్వారానే సుమారు రూ. 22 కోట్లు రాబట్టింది. విడుదలైన మొదటి రోజే భారీ ఆరంభం నమోదు చేసింది. డే 1లో రూ. 67 కోట్లు, డే 2లో రూ 19 కోట్లు, డే 3లో రూ. 18 కోట్లు, డే 4లో రూ. 19 కోట్లు రాబట్టడంతో, నాలుగు రోజుల్లోనే ఇండియా వైడ్ నెట్ కలెక్షన్ రూ. 123 కోట్లు దాటింది. మొదటి వారంలో కూడా అదే ఊపు కొనసాగించింది. ఇక 5వ రోజు రూ. 7.5 కోట్లు, 6వ రోజు రూ. 7 కోట్లు, 7వ రోజు రూ. 6.75 కోట్లు, 8వ రోజు రూ. 7.5 కోట్లు వసూలు చేసి, వారం మొత్తానికి రూ.169.3 కోట్లు (ఇండియా వైడ్ నెట్) సాధించింది. గ్రాస్ కలెక్షన్ మాత్రం రూ. 200 కోట్ల మార్క్‌ను దాటింది.

ఇక రెండో వారం కాంతార 2 సినిమా విడుదలతో కలెక్షన్స్ పై కొంత ప్రభావం పడింది. కానీ, పవర్ స్టార్ మానియా కొనసాగింది. 9 వ రోజు రూ. 4.75 కోట్లు, 10 వ రోజు రూ. 4.6 కోట్లు రాబట్టి, కేవలం 10 రోజుల్లోనే "ఓజీ" రూ. 179 కోట్ల నెట్, రూ. 216 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంది. ఆ తర్వాతి రోజుల్లో కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద తన దూకుడు కొనసాగించింది. 11వ రోజు రూ. 4.35 కోట్లు, 12 వ రోజున రూ. 2 కోట్లు, 13 వ రోజున రూ. 1.8 కోట్లు, 14 వ రోజున రూ. 1.18 కోట్లు, 15 వ రోజున రూ. 1 కోటి వసూలు చేసింది. దీంతో రెండు వారాల్లో ఇండియా వైడ్ నెట్ కలెక్షన్ రూ. 188 కోట్లు, గ్రాస్ రూ. 226 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 316 కోట్ల గ్రాస్ వసూళ్లతో మరో మైలురాయిని అందుకుంది.

వసూళ్లను పరిశీలిస్తే, 16వ రోజు రూ 0.83 కోట్లు, 17వ రోజు రూ 1.47 కోట్లు రాబట్టింది. 18వ రోజు ఇండియా వైడ్‌గా రూ. 1.53 కోట్ల నెట్, రూ. 1.80 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ మార్కెట్‌ నుంచి రూ. 0.50 కోట్ల నెట్ రాబడింది. మొత్తం 18 రోజుల్లో "ఓజీ" ఇండియా వైడ్‌గా రూ. 193 కోట్ల నెట్, రూ. 234 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ. 325 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువైంది.

19 వ రోజు కలెక్షన్ రిపోర్ట్
ఇక ఓజీ 19వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. గత రెండు రోజులు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ జోరు కనిపించింది. ఇక 19 రోజు ఓజీ కలెక్షన్స్ కాస్త తగ్గుముఖం పడ్డాయి. నేడు ఇండియా వైడ్‌గా రూ. 1.1 కోట్ల నెట్, రూ. 1.50 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.0.30 కోట్ల నెట్ వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూ. 2 కోట్లు చేరిందని అంచనా. దీంతో OG మొత్తం ఇండియా వైడ్ రూ. 194 కోట్లు (నెట్), రూ.234 కోట్లు (గ్రాస్) వసూలు చేసే అవకాశముంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ.330 కోట్ల మార్క్‌ చేరువ కానున్నట్టు అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. త్వరలోనే రూ.350 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X