OG Day 2 Collections Worldwide: తొలి రోజు చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. OG మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నది. పెయిడ్ ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ప్రీమియర్లు, రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఓజీ సినిమాకు వచ్చిన హైప్‌తో తెలుగ రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, ఓవర్సీస్‌లో రికార్డు బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ (OG) సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇండియాలో ఈ సినిమా హక్కులు 190 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 60 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 225 కోట్ల షేర్.. 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు 3.14 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 49 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా నైజాంలో 24 కోట్ల రూపాలయు, సీడెడ్‌లో 7.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.7 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.2 కోట్ల రూపాయలు, గుంటూరులో 6.35 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 4.8 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఏపీ, నైజాంలో కలిపి మొత్తంగా 63 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగేతర రాష్ట్రాల్లో తమిళ్, హిందీ ప్రాంతాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పుంజుకొంటున్నాయి. ఈ సినిమా కర్ణాటకలో భారీగా వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం ఇతర రాష్ట్రాల్లో 5 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 4 మిలియన్లు అంటే 36 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 154 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ మధ్యాహ్నం వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం రెండో రోజు వైరల్డ్ వైడ్‌గా 30 నుంచి 35 కోట్ల రూపాయలు నెట్, 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











