OG 20 Days Box Office: బాక్సాఫీస్ వద్ద ‘ఓజీ’ఎదురీత.. 20 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

OG Box Office Collections Worldwide: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ (They Call Him OG)" బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై, మొదటి షో నుంచే అద్భుతమైన స్పందన అందుకుంది. మొదటి షో నుంచే పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్‌కి ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా పండగలా మారింది. దేశవ్యాప్తంగా థియేటర్లు పవన్ జయహో నినాదాలతో మార్మోగాయి. ఇప్పటికే పలు చోట్ల బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలో ఓజీ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఎంత? ఓజీ రోజు వారి కలెక్షన్లు ? 20వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్.. హాలీవుడ్ లెవెల్ యాక్షన్
ఓజీ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. "ఆర్ఆర్ఆర్" లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ప్రతి యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ప్రెజెంటేషన్, సెట్ డిజైన్ అంతా హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దారు. సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్ , మనోజ్ పరమహంస సంయుక్తంగా నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో థండర్ ఎఫెక్ట్ సృష్టించింది. ఫైట్స్, చేజింగ్ సీన్స్, స్లో మోషన్ షాట్స్‌కి థమన్ మ్యూజిక్ ప్రాణం పోశాడు.

OG Day 20 Expected Box Office Collections Worldwide Pawan Kalyan movie verge of the Break Even Target

స్టార్ కాస్ట్
"ఓజీ" సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమయి వంటి ప్రముఖ నటులు నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో పవన్‌కు సరితూగే పోటీ ఇచ్చాడు. ఆయన నటనకు క్రేజ్ పెరిగింది. జాకీ ష్రాఫ్ పాత్ర కథలో మలుపు తెచ్చింది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉండటం వల్ల సినిమా ఎక్కడా డ్రాగ్ అనిపించలేదు. సుజీత్ పవన్ కేరెక్టర్‌ను పూర్తిగా కొత్త మానర్‌లో డిజైన్ చేశారు. పవన్ డైలాగ్ డెలివరీ, మాస్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్స్‌లలో ఎనర్జీ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ రీఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ప్రీ-రిలీజ్ బిజినెస్‌లోనే సంచలనం
సినిమా విడుదలకు ముందు నుంచే ట్రేడ్ సర్కిల్స్‌లో "ఓజీ"పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందన్న వార్తతోనే బిజినెస్ హీట్ పెరిగిపోయింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.194 కోట్ల మార్క్ దాటింది. పవన్ స్టార్ ఢమ్, మాస్ ఇమేజ్ దృష్ట్యా సినిమా థియేట్రికల్ రికవరీ టార్గెట్ రూ.200 కోట్ల షేర్‌గా నిర్ణయించబడింది. అంటే వసూళ్లు రూ.400 కోట్ల గ్రాస్ మార్క్ దాటితే బిగ్ సక్సెస్‌గా పరిగణించవచ్చు. ఆ దిశగా 'ఓజీ'వేగంగా దూసుకుపోతోంది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ
'ఓజీ' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ప్రేమియర్స్ ద్వారానే సుమారు రూ.22 కోట్లు రాబట్టి పవర్‌ఫుల్ ఆరంభాన్ని నమోదు చేసింది. మొదటి రోజే రూ.67 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి పవన్ కళ్యాణ్ పవర్‌ను మరోసారి నిరూపించింది. తరువాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ, రెండో రోజు రూ.19 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు వసూలు చేయడంతో కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియా వైడ్ నెట్ కలెక్షన్ రూ.123 కోట్లను దాటింది. మొదటివారంలో కూడా సినిమా ఊపుతగ్గకుండా వసూళ్ల దూకుడును కొనసాగించింది. ఐదవ రోజు రూ.7.5 కోట్లు, ఆరో రోజు రూ.7 కోట్లు, ఏడవ రోజు రూ.6.75 కోట్లు, ఎనిమిదవ రోజు రూ.7.5 కోట్లు వసూలు చేయడంతో మొదటి వారం మొత్తం రూ.169.3 కోట్లు (ఇండియా వైడ్ నెట్) రాబట్టింది. గ్రాస్ కలెక్షన్ మాత్రం రూ.200 కోట్ల మార్క్‌ను దాటి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

ఇక రెండో వారం "కాంతార 2" సినిమా విడుదలతో కొంత ప్రభావం పడినా, పవర్ స్టార్ మానియా మాత్రం తగ్గలేదు. తొమ్మిదవ రోజు రూ.4.75 కోట్లు, పదవ రోజు రూ.4.6 కోట్లు వసూలు చేయడంతో కేవలం పది రోజుల్లోనే "ఓజీ" రూ.179 కోట్ల నెట్, రూ.216 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను అందుకుంది. తరువాతి రోజుల్లో కూడా సినిమా స్థిరంగా వసూళ్లు సాధించింది. పదకొండవ రోజు రూ.4.35 కోట్లు, పన్నెండవ రోజు రూ.2 కోట్లు, పదమూడోవ రోజు రూ.1.8 కోట్లు, 14వ రోజు రూ.1.18 కోట్లు, 15వ రోజు రూ.1 కోటి వసూలు చేసింది. రెండు వారాలకే ఇండియా వైడ్ నెట్ కలెక్షన్ రూ.188 కోట్లు దాటగా, గ్రాస్ కలెక్షన్ రూ.226 కోట్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం "ఓజీ" రూ.316 కోట్ల గ్రాస్ వసూళ్లతో మరో మైలురాయిని సృష్టించి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఓజీ మూడో వారం ఇండియా వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ చూస్తే.. 16వ రోజు రూ 0.83 కోట్లు, 17వ రోజు రూ 1.47 కోట్లు . 18వ రోజు రూ. 1.53 కోట్లు, 19వ రోజు రూ. 0.74 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇలా 19 రోజుల్లో "ఓజీ" ఇండియా వైడ్‌గా రూ. 193 కోట్ల నెట్, రూ. 234 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ. 325 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువైంది.

20వ రోజు కలెక్షన్ రిపోర్ట్
ఇక ఓజీ 20వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. వీకెండ్ దుమ్మురేపిన ఓజీ మూవీ నార్మల్ డేస్ లో కలెక్షన్స్ పడిపోతున్నాయి. ఇక 20 రోజు ఓజీ కలెక్షన్స్ పడిపోయాయి. నేడు థియేటర్ ఆక్యూపెనీ చాలా పడిపోయింది. మార్నింగ్ , మ్యాట్నీ షోలకు ఆక్యూపెన్సీ 24 శాతం నమోదైంది. ఈవినింగ్, సెకండ్ షో టైంలో ఆక్యూపెన్సీ పెరగవచ్చని అంచనా.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఓజీ 20 వ రోజు రూ. 1 కోటి నెట్, రూ. 1.40 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.0.25 కోట్ల నెట్ వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూ. 1.5 కోట్లు చేరిందని అంచనా. దీంతో OG మొత్తం ఇండియా వైడ్ రూ. 194. 5 కోట్లు (నెట్), రూ.235 కోట్లు (గ్రాస్) వసూలు చేసే అవకాశముంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ సినిమా రూ.334 కోట్ల మార్క్‌ చేరువ కానున్నట్టు అంచనా. నార్మల్ డేస్ కలెక్షన్స్ పెరిగితే.. త్వరలోనే రూ.350 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X