OG 21 Days Box Office: ‘ఓజీ’షాకింగ్ వసూళ్లు.. 21 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
OG Box Office Collections Worldwide: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (They Call Him OG)" విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, పవన్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఎంట్రీకి అభిమానులు ఓ రేంజ్ లో సంబరాలు చేసుకున్నారు. కటౌట్స్, బ్యానర్లు, ఫైర్‌వర్క్స్‌తో ప్రతి స్క్రీన్ పండుగ వాతావరణంలో మారిపోయింది. ఈ నేపథ్యంలో ఓజీ కలెక్షన్స్ ఎంత? రోజు వారి కలెక్షన్లు ? 21వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్, పవర్‌ప్యాక్ యాక్షన్
ప్రముఖ డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన "ఓజీ"లో ప్రతి సన్నివేశాన్ని హాలీవుడ్ రేంజ్‌లో చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంసా సంయుక్తంగా అందించగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి నిర్వహించారు. మ్యూజిక్ మాంత్రికుడు ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో థండర్ ఎఫెక్ట్ సృష్టించింది. ముఖ్యంగా పవన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫైట్స్, మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్‌గా మారాయి. 'ఓజీ'లో ప్రతి ఫైట్ బ్లాక్ హాలీవుడ్ స్టైల్‌లో ఉండటంతో, అభిమానులు పవన్ రీ-ఎంట్రీని సెలబ్రేట్ చేస్తున్నారు.

స్టార్ కాస్ట్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్
'ఓజీ'సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమయి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో సినిమాకు రియలిస్టిక్ టచ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ నుంచి చివరి ఫైట్ వరకు ప్రతి క్షణం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. డైరెక్టర్ సుజీత్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రెజెంటేషన్‌తో పవన్ పవర్‌ను కొత్త లెవెల్‌కు తీసుకెళ్లాడు. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడంతో 'ఓజీ'ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 194 కోట్ల మార్క్‌ని దాటింది. ఫుల్ రికవరీ కోసం థియేట్రికల్ షేర్ రూ. 200 కోట్లు, అంటే గ్రాస్ రూ. 400 కోట్లకు పైగా రావాలని ట్రేడ్ సర్కిల్స్ భావించాయి. ఇప్పుడు సినిమా ఆ దిశగా వేగంగా దూసుకుపోతోంది.
ఓజీ బాక్సాఫీస్ వసూళ్ల సునామీ
'ఓజీ' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల తుఫాన్ సృష్టించింది. ప్రేమియర్స్ ద్వారానే రూ. 22 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, మొదటి రోజే రూ. 67 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాతి రోజుల్లో కూడా అదే ఊపు కొనసాగింది. రెండవ రోజున రూ. 19 కోట్లు, మూడవ రోజు రూ. 18 కోట్లు, నాల్గవ రోజు రూ. 19 కోట్లు, ఐదవ రోజు రూ. 7.5 కోట్లు, ఆరవ రోజు రూ. 7 కోట్లు, ఏడవ రోజు రూ. 6.75 కోట్లు, ఎనిమిదవ రోజు రూ. 7.5 కోట్లు వసూలు చేసింది. దీంతో "ఓజీ" మొదటి వారంలోనే రూ. 169.3 కోట్ల నెట్, రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది.ఇక రెండవ వారం కాంతార 2 సినిమా విడుదలతో కొంత ప్రభావం ఉన్నా, పవన్ మానియా మాత్రం తగ్గలేదు. తొమ్మిదవ రోజు రూ. 4.75 కోట్లు, పదవ రోజు రూ. 4.6 కోట్లు రాబట్టి, కేవలం పది రోజుల్లోనే రూ. 179 కోట్ల నెట్, రూ. 216 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తర్వాతి రోజుల్లో కూడా వసూళ్లు స్థిరంగా కొనసాగాయి.
పదకొండవ రోజు రూ. 4.35 కోట్లు, పన్నెండవ రోజు రూ. 2 కోట్లు, పదమూడు రోజు రూ. 1.8 కోట్లు, పద్నాలుగు రోజు రూ. 1.18 కోట్లు, పదిహేనవ రోజు రూ. 1 కోటి వసూలు చేసింది. దీంతో రెండు వారాల్లో ఇండియా వైడ్ నెట్ రూ. 188 కోట్లు, గ్రాస్ రూ. 226 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 316 కోట్లు దాటింది. మూడవ వారం "ఓజీ" బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ చాలా తగ్గింది. 16వ రోజు రూ. 0.83 కోట్లు, 17వ రోజు రూ. 1.47 కోట్లు, 18వ రోజు రూ. 1.53 కోట్లు, 19వ రోజు రూ. 0.74 కోట్లు, 20వ రోజు రూ. 0.70 కోట్లు వసూలు చేసింది. దీంతో 20 రోజుల్లో ఇండియా వైడ్ నెట్ రూ. 193.5 కోట్లు, గ్రాస్ రూ. 236 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 334 కోట్లకు చేరుకుంది.
ఇక 21వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే, థియేటర్ ఆక్యుపెన్సీ సాధారణ స్థాయిలోనే ఉంది. మార్నింగ్, మ్యాట్నీ షోలలో 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈవెనింగ్ షోలలో కొంత పెరుగుదల కనిపించవచ్చని అంచనా. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 21వ రోజు ఇండియా నెట్ వసూళ్లు రూ. 1 కోటి, గ్రాస్ రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్ వసూళ్లు రూ. 0.20 కోట్లు చేరగా, మొత్తం ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ రూ. 1.5 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో ఓజీ మూవీ 21 రోజులలో ఇండియా వైడ్‌గా రూ. 195 కోట్ల నెట్, రూ. 236 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ గ్రాస్‌తో వరల్డ్‌వైడ్‌గా మొత్తం రూ. 336 కోట్ల మార్క్ కు చేరువైంది. ప్రస్తుతం సినిమా రూ. 336 కోట్ల వద్ద ఉన్నప్పటికీ, ట్రేడ్ సర్కిల్స్ అంచనాల ప్రకారం.. కాస్త వీకెండ్ రోజుల్లో వసూళ్లు పెరిగితే.. "ఓజీ"రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











