OG 22 Days Box Office:‘ఓజీ’ మేనియా.. 22 రోజుల్లో పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
OG Box Office Collections Worldwide: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (They Call Him OG)" విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదలతో, థియేటర్లల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్‌కి ఫ్యాన్స్ ఊగిపోయారు. పవర్ స్టార్ మేనియా మరోసారి టాలీవుడ్‌ను ఊపేసింది. ఈ నేపథ్యంలో ఓజీ కలెక్షన్స్ ఎంత? రోజు వారి కలెక్షన్లు ? 22వ రోజున ఓజీ ఎన్ని కోట్ల వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్
'ఓజీ'సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంసా సంయుక్తంగా అందించగా, ప్రతి ఫ్రేమ్‌లోనూ హాలీవుడ్ లెవెల్ విజువల్స్ కనిపించాయి. ఫైట్ సీక్వెన్స్‌లు, యాక్షన్ బ్లాక్‌లు అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేయడం వల్ల థియేటర్లలో ప్రేక్షకులు సీట్లను వదిలి నిలబడి చప్పట్లు కొట్టేలా మారింది. ఎడిటర్ నవీన్ నూలి క్రిస్ప్ కట్టింగ్‌తో స్క్రీన్ ప్లేను మరింత పక్కాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా హైలైట్‌గా నిలిచింది. ప్రత్యేకంగా పవన్ ఫైట్స్ సమయంలో వచ్చే థమన్ థండర్ ఎఫెక్ట్స్ వాతావరణాన్ని సృష్టించాయి.

స్టార్ కాస్ట్‌తో స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్
'ఓజీ'లో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, సీనియర్ నటులు జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమయి వంటి ప్రతిభావంతులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన షేడ్ ఉండటంతో సినిమా మొత్తం రియలిస్టిక్ ఫీల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుండి క్లైమాక్స్ ఫైట్ వరకు స్క్రీన్‌పై పవర్ ఎనర్జీ ఉరకలేస్తుంది. దర్శకుడు సుజీత్, పవన్ స్టైల్, మాస్ మేనరిజం, ఇంటెన్స్ యాక్షన్ కలిపి పవర్ స్టార్ ఇమేజ్‌కి సరిపోయే రేంజ్‌లో ప్రెజెంట్ చేశారు. ప్రతి సీన్‌లోనూ పవన్ స్టార్ పవర్, ఆరా కనిపించింది.
ప్రీ-రిలీజ్ బిజినెస్, భారీ అంచనాలు
సినిమా విడుదలకు ముందే 'ఓజీ'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. చాలా రోజులు తరువాత పవన్ తిరిగి యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నందున ట్రేడ్ సర్కిల్స్ భారీ ఫిగర్లను ఊహించాయి. చివరికి సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 194 కోట్లు దాటింది. ఫుల్ రికవరీ కోసం థియేట్రికల్ షేర్ రూ. 200 కోట్లు దాటాల్సి ఉందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. అంటే గ్రాస్ వసూళ్లు రూ. 400 కోట్లకు పైగా రావాలని అంచనా.
కలెక్షన్ల సునామీ
'ఓజీ'విడుదలైన రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన తొలి రోజు ప్రేమియర్స్ ద్వారానే రూ. 22 కోట్ల వసూళ్లతో శుభారంభం నమోదు చేసుకుంది. మొదటి రోజే గ్రాస్ రూ. 67 కోట్ల వద్ద ఆగి, ఇది పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచింది. రెండవ రోజు రూ. 19 కోట్లు, మూడవ రోజు రూ. 18 కోట్లు, నాలుగో రోజు రూ. 19 కోట్లు, ఐదో రోజు రూ. 7.5 కోట్లు, ఆరవ రోజు రూ. 7 కోట్లు, ఏడవ రోజు రూ. 6.75 కోట్లు, ఎనిమిదవ రోజు రూ. 7.5 కోట్లు వసూలు చేసింది. ఈ వసూళ్లతో సినిమా మొదటి వారంలోనే రూ. 169.3 కోట్ల నెట్, రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటి 2025లో టాప్ ఓపెనింగ్‌గా నిలిచింది.
రెండవ వారం కాంతార 2 విడుదలతో కొన్ని సెంటర్లలో స్క్రీన్ షేరింగ్ ప్రభావం ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ మానియా మాత్రం ఎక్కడా తగ్గలేదు. తొమ్మిదవ రోజు రూ. 4.75 కోట్లు, పదవ రోజు రూ. 4.6 కోట్లు వసూలు చేయడంతో కేవలం పది రోజుల్లోనే 'ఓజీ' రూ. 179 కోట్ల నెట్, రూ. 216 కోట్ల గ్రాస్ దాటింది. ఆ తర్వాతి రోజుల్లో వసూళ్లు క్రమంగా స్థిరంగా కొనసాగాయి. 11వ రోజు రూ. 4.35 కోట్లు, 12వ రోజు రూ. 2 కోట్లు, 13వ రోజు రూ. 1.8 కోట్లు, 14వ రోజు రూ. 1.18 కోట్లు, 15వ రోజు రూ. 1 కోటి వసూలు చేసింది. దీంతో రెండు వారాల్లో ఇండియా వైడ్ నెట్ రూ. 188 కోట్లు, గ్రాస్ రూ. 226 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 316 కోట్లు దాటింది. మూడవ వారం కూడా వసూళ్లు స్థిరంగా కొనసాగాయి. 16వ రోజు రూ. 0.83 కోట్లు, 17వ రోజు రూ. 1.47 కోట్లు, 18వ రోజు రూ. 1.53 కోట్లు, 19వ రోజు రూ. 0.74 కోట్లు, 20వ రోజు రూ. 0.70 కోట్లు, 21వ రోజు రూ. 0.70 కోట్లు వసూలు చేసింది. దీంతో 21 రోజుల్లో 'ఓజీ' ఇండియా వైడ్ నెట్ రూ. 194 కోట్లు, గ్రాస్ రూ. 235 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 334 కోట్లు చేరుకుంది.
22 రోజు కలెక్షన్స్ ఇలా..
పవన్ కళ్యాణ్ 'ఓజీ'22వ రోజు థియేటర్లలో బలంగా రన్ అవుతోంది. మార్నింగ్ షోలలో సాధారణ స్థాయి ఆక్యుపెన్సీ ఉండగా, ఈవెనింగ్ షోలలో కొంత పెరుగుదల కనిపించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఓజీ ఇండియా నెట్ రూ. 0.9 కోట్లు కాగా, ఇండియా గ్రాస్ రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్ గ్రాస్ రూ. 0.25 కోట్లు వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా "ఓజీ" 22వ రోజు రూ. 1.6 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. దీంతో ఓజీ 22 రోజుల్లో ఇండియా వైడ్ నెట్ రూ. 195.5 కోట్లు, గ్రాస్ రూ. 236.5 కోట్లు, ఓవర్సీస్ వసూళ్లతో కలిపి వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 336 కోట్ల మార్క్ దాటింది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం 'ఓజీ'వీకెండ్ లో జోరుగా కొనసాగిస్తే.. ఫైనల్ వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 350-360 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











