OG Andhra, Nizam Closing Collections: ఓజీ ఆంధ్రా, నైజాం క్లోజింగ్ కలెక్షన్లు.. పవన్ మూవీకి లాభమా? నష్టమా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఓజీ (OG). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు.
సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వహించారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఓజాస్ గంభీరా (OG) అనే పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. జపనీస్, కొరియన్ దేశాల్లోని ఫైట్స్‌ను కంపోజ్ చేశారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓజీ (OG) సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. జీఎస్టీతో కలిపి ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 70 కోట్ల రూపాయలు అంటే.. గుంటూరు 13 కోట్లు, పశ్చిమ గోదావరి 10 కోట్లు, నెల్లూరు 6 కోట్లు, కృష్ణా జిల్లాలో 11 కోట్లు రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. దాంతో ఈ చిత్రం భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
అయితే ఈ సినిమా నైజాంలో 57 కోట్ల రూపాయల షేర్, సీడెడ్‌లో 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 17 కోట్ల రూపాయల షేర్, గుంటూరులో 11.6 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 12.18 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4.8 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. జీఎస్టీ మినహాయిస్తే.. ఇక నైజాంలో ఈ సినిమా 3 కోట్ల రూపాయల నష్టం, సీడెడ్‌లో 2 కోట్ల రూపాయల నష్టం, ఉత్తరాంధ్రలో 3 కోట్ల నష్టం, గుంటూరులో 1.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.2 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 1.2 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. జీఎస్టీ తిరిగి ఇస్తే ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారందరికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. కొంత మంది లాభాలతో ముగిసే అవకాశం లేకపోలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











