OG Total Collections: పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లు.. 2025లో టాప్ లేపిన ఓజీ.. ఎన్ని కోట్లంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా 2025లో ఘనతను సాధించింది. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించి ఈ సినిమా ఈ ఏడాది అనేక రికార్డులను క్రియేట్ చేసింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత ఏపీ, తెలంగాణలోనే కాకుండా నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కొనసాగించింది.
OG చిత్రం విషయానికి వస్తే.. మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా సుమారుగా 250 కోట్ల రూపాలయ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా టోటల్ కలెక్షన్లు ఎంత? ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఏ రేంజ్ లాభాలను సాధించింది? ఈ సినిమా సాధించిన రికార్డులు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ (OG) సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగింది నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సిన పరిస్థితిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్‌గా రూపొందిన ఓజీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం క్రియేట్ చేసింది. ఈ మూవీ సుమారుగా 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా నైజాంలో 57 కోట్ల రూపాయల షేర్, సీడెడ్‌లో 18 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 17 కోట్ల రూపాయల షేర్, గుంటూరులో 11.6 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 12.18 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4.8 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ చిత్రం కర్ణాటకలో 20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, హిందీలో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలో 233 కోట్ల గ్రాస్ వసూ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికాలో సుమారుగా 5.5 మిలియన్ డాలర్లు, కెనడాలో 300K డాలర్లతో కలిపి సుమారుగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిడిల్ ఈస్ట్‌లో 4.5 కోట్ల రూపాయలు, యూకే, ఐర్లాండ్‌లో 4.5 కోట్ల రూపాయలు, ఆస్ట్రేలియాలో 3.5 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 25 లక్షల రూపాయలు, సింగపూర్‌లో 10 లక్షల రూపాయలు, ఇతర దేశాల్లో 2.66 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
ఓజీ చిత్రం వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 233 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 65 కోట్లకుపైగా వసూళ్లను నమోదుచేసింది. ధాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 297 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ చిత్రం బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత అనేక రికార్డులను నమోదు చేసుకొన్నది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా మారింది. అలాగే 2025 సంవత్సరంలో భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సౌత్ ఇండియాలో 5వ అతిపెద్ద కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. నాన్ పాన్ ఇండియా కేటగిరిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా రికార్డును తన పేరిట నమోదు చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











