OG Nizam Business: రికార్డు ధరకు OG నైజాం రైట్స్.. టాప్ ప్రొడ్యూసర్ చేతికి పవన్ కల్యాణ్ మూవీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఓజీ విషయానికి వస్తే.. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్‌తో ముంబై, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే.. నైజాం థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. నైజాం థియేట్రికల్ రైట్స్ వివరాల్లోకి వెళితే..

OG సినిమాకు సంబంధించిన గ్లింప్స్, పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు రిలీజ్ చేయగా.. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దాంతో ఈ మూవీకి భారీ క్రేజ్, బిజినెస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు భారీగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో నైజాం ఏరియా థియేట్రికల్ హక్కుల కోసం ఏషియన్ సునీల్, దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ పోటీ పడుతున్నట్టు సమాచారం.
అయితే OG సినిమా నైజాం థ్రియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేశారు. దాదాపు ఆయనకే రైట్స్ లభించే అవకాశం ఉంది. నైజాం ఏరియా థియేట్రికల్ హక్కులు సుమారుగా 55 కోట్ల రూపాయల (అదనంగా జీఎస్టీ కలిపి) మేర అమ్ముడయ్యే అవకాశం ఉంది. మొత్తంగా జీఎస్టీతో కలిపి ఈ సినిమా రైట్స్ 60 నుంచి 63 మధ్య క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఓజీ సినిమాతో బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 సినిమా పోటీ పడుతున్నది. ఈ రెండు సినిమాలు కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీని నివారించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి తమ రిలీజ్‌ను వాయిదా వేసుకొంటాయా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











