OG Advance Booking: ఓజీ అడ్వాన్స్ బుక్కింగ్స్.. నార్త్ అమెరికాలో పవన్ కళ్యాణ్ ఊచకోత.. ఎన్ని కోట్లంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో గ్యాంగస్టర్ యాక్షన్ ఫిల్మ్ ఓజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చివరిగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకలేకపోయింది. ఇక ఇప్పుడు OG చిత్రంతో అలరించేందుకు సిద్ధం అయ్యారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సూపర్ స్టైలిష్, మాస్ లుక్ తో అలరించేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే ఓజీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా అందిస్తున్న అప్డేట్స్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. పైగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. పైగా ఆయన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

OG Movie North America Advance Booking Box Office Collections

మరోవైపు ఓజీ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. అంతేకాకుండా ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం.

ఇలా సినిమాపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఆ స్థాయిలోనే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.100 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. మున్ముందు డబల్ కానుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో మాత్రమే ఓజీ పండగా మొదలైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూల్ చేసి సత్తా చాటుంతోంది ఓజీ.

తాజాగా అందించిన రిపోర్ట్ ప్రకారం.. ఓవర్సీస్ లో కేవలం నార్త్ అమెరికాలో ఓజీ అడ్వాన్స్ బుక్కింగ్ ద్వారా భారీగా రిటర్న్స్ దక్కుతున్నాయి. ఇప్పటి వరకు 45000 టికెట్లు అమ్ముడయ్యాయని, దాంతో 1.2 మిలియన్ డాలర్లు కలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. ఇండియన్ కరెన్సీలో ప్రీ సేల్స్ ద్వారా ఓజీ సినిమాకు రూ.11 కోట్లకు పైగా వసూలైందని తెలుస్తోంది. రూ.250 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత తిరిగి వసూల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: og pawan kalyan box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X